నేడు రాజభవన్ కు షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైెఎస్ షర్మిల నేడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం కానున్నారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైెఎస్ షర్మిల నేడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలపై గవర్నర్ కు షర్మిల వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ నుంచి నేరుగా పాదయాత్రకు బయలుదేరనున్నారు.
నేటి నుంచి పాదయాత్ర...
ఇటీవల పాదయాత్రకు పోలీసుల ఆంక్షల దృష్ట్యా విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేశారంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆమె హైదరాబాద్ లోనూ ఆందోళన చేశారు. ఆడిపోయిన చోట నుంచే పాదయాత్ర ఈరోజు నుంచి ప్రారంభించనున్నారు. నర్పంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి పాదయాత్రను నేటి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.