హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలిగాలులు తీవ్రమయ్యాయి. దీంతో వాతవావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

Update: 2022-01-23 02:38 GMT

హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలిగాలులు తీవ్రమయ్యాయి. దీంతో వాతవావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు, మూడురోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.

రెండు రోజుల్లో....
ఈరోజు 15.3 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. మార్నింగ్ వాకర్స్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని సూచిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలిగాలుల తీవ్రత ఎక్కువయ్యే అవకాశముంది. ఆదివారం, సోమవారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించిది.


Tags:    

Similar News