ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది

Update: 2022-08-13 03:54 GMT

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మూడు విడతల్లో ఎంసెస్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నెల 21వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ ఎంసెట్ ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం అవుతుందని ఉన్నత విద్యామండలి పేర్కొంది. 23వ తేదీ నుంచి 30 వ తేదీ వరకూ ధృవపత్రాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టంబరు 2వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు సమయం ఇచ్చారు.

స్పాట్ అడ్మిషన్ల కోసం....
సెప్టంబరు ఆరో తేదీ నుంచి ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. సెప్టంబరు 28వ తేదీ నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. సెప్టంబరు 28, 29 తేదీల్లో రెండో విడత స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్బంబరు 30 న సెకండ్ టైమ్ ధృవ పత్రాల పరిశీలన జరుగుతుంది. సెప్టంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకూ వెబ్ ఆప్షన్లకు సమయం ఇచ్చారు. అక్బోబరు నాలుగో తేదీన రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అక్టోబరు 13న తుది విడత ధృవపత్రాల పరిశీలన, అక్టోబరు 11 నుంచి 14వ వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు సమయం ఇచ్చారు. అక్టోబరు 17న తుది విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. అక్టోబరు 20వ తేదీన స్పాట్ అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేయనుంది.


Tags:    

Similar News