పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

శ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. వెండి కూడా కొంత తగ్గి ఊరట కల్గించింది

Update: 2021-11-24 01:22 GMT

బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పెరిగేదే కాని వాటి ధరల్లో పెద్దగా తగ్గుదల అంటూ ఉండదు. బంగారాన్ని ఈరోజు కూడా పెట్టుబడిగా చూసేవారు అనేక మంది ఉన్నారు. స్థలాలకు ఎంత డిమాండ్ పెరుగుతుందో, బంగారానికి కూడా భవిష్యత్ లో అంతే డిమాండ్ ఉంటుందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. తాజాగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. వెండి కూడా కొంత తగ్గి ఊరట కల్గించింది. ఈ తగ్గుదలకు కారణం అంతర్జాతీయ మార్కెట్ లో ధరల తగ్గుదల కారణమని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ లో....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారంధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,050 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,650 లుగా ఉంది. ప్రస్తుతం వెండి ధర కిలోకు 1,548 రూపాయలు తగ్గి ప్రస్తుతం 68,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News