Hyderabad: ఇవి డబ్బులా?.. కాగితాలా..? పెద్ద మొత్తంలో పట్టుబడ్డ నగదు

తెలంగాణ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, బంగారం ఎరులైపారుతోంది. ఇప్పటికే పోలీసులు...

Update: 2023-11-19 08:35 GMT

తెలంగాణ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, బంగారం ఎరులైపారుతోంది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, బంగారాన్ని సీజ్‌ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ వచ్చిన నాటి నుంచి పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు స్వాధీనం చేసుకోగా, ఇప్పుడు హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది. ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ కి ఈ డబ్బు తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో 7.40 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. వీటిని 6 కార్లలో తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.

ఇంత పెద్ద మొత్తం పట్టుబడటం ఇదే మొదటిసారి:

పోలీసులతో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డబ్బు తెలంగాణ ఎన్నికల కోసం వినియోగిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల కోడ్‌ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇది మొదటి సారి అని పోలీసులు చెబుతున్నారు. గతంలో ఏడు కోట్ల విలువ చేసే బంగారం పట్టుబడిన దాకాలు చూశాము. అయితే ఒకేసారి ఇన్ని కోట్ల రూపాయల కట్టలు బహిరంగంగా దొరకడం ఎన్నికల్లో ఇదే మొదటిసారి. వీటిని వేరే ప్రాంతం నుండి హైదరాబాద్ కు ఎవరు చెప్తే ఎవరు తీసుకొచ్చారు అని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు వివరాలను పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.

ఇప్పటి వరకు రూ.600 కోట్లు

మరోవైపు తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న 600 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన డబ్బు గురించి ఆధారాలు చూపించిన వారికి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు 94 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 36 కోట్ల విలువచేసే డ్రగ్స్,179 కోట్ల రూపాయలు విలువ చసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News