Telangana Exit Polls : కాంగ్రెస్ దే హవా.. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ ఏజెన్సీలు చెప్పిందిదే

తెలంగాణ ఎన్నికల్లో పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తేలింది

Update: 2023-11-30 12:31 GMT

తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ అత్యధికంగానే నమోదయింది. దాదాపు 70 శాతానికి పైగానే పోలింగ్ నమోదయింది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారంహంగ్ ఏర్పడుతుందని తేలింది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ దే హవా కనిపించింది. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ - 56, బీఆర్ఎస- 48, బీజేపీ -10, ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. ఆరా సంస్థ కాంగ్రెస్ 58 నుంచి 67, బీఆర్ఎస్ 41 నుంచి 49, బీజేపీ ఐదు నుంచి ఏడు, ఇతరులు ఏడు స్థానాల్లో గెలుస్తాయని తేల్చింది.

వివిధ సంస్థలు...
సీప్యాక్ కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 41, బీజేపీ 4, ఇతరులు తొమ్మిది స్థానాల్లో గెలుస్తాయని తేల్చింది. పీటీఎస్ గ్రూపు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కు 65 నుంచి 68 స్థానాలు గెలుచుకుంటుందని తేల్చింది. బీఆర్ఎస్ 35 నుంచి నలభై స్థానాలకే పరిమితమవుతుందనితేల్చింది.బీజేపీ ఆరు స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. మెజారిటీ సర్వేలు మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగానే తీర్పు చెప్పాయి. కాంగ్రెస్ కంఫర్ట్‌బుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఎక్కువ సంస్థలు తేల్చాయి.


Claim :  fff
Claimed By :  ff
Fact Check :  True
Tags:    

Similar News