కామారెడ్డి బరిలో రేవంత్‌రెడ్డి? మరి షబ్బీర్‌ సంగతేంటి?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల పనితీరు వేగవంతం అవుతోంది. జనాల్లోకి దూసుకుపోతున్నారు. ఎవరివారు

Update: 2023-10-28 03:51 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల పనితీరు వేగవంతం అవుతోంది. జనాల్లోకి దూసుకుపోతున్నారు. ఎవరివారు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. నిన్న కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలైన విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సారి తెలంగాణలో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. చర్చల అనంతరం రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 55, రెండో విడతలో 45 సీట్లను విడుదల చేసింది. అయితే, రెండో విడత అభ్యర్థుల ప్రకటన అనంతరం.. పార్టీలో అసంతృప్తుల సెగలు రేపుతున్నాయి. ఈ తరుణంలో కామారెడ్డి సీటు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇక్కడి బరిలో దిగుతున్నారు. అయితే, మొదటినుంచి తనకే టికెట్ వస్తుందని షబ్బిర్ అలీ పేర్కొంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం విడుదల చేసిన రెండోజాబితాలో షబ్బీర్‌అలీకి చోటు దక్కలేదు. కామారెడ్డి నుంచి ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో అయోమయం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా షబ్బీర్‌అలీకి టికెట్‌ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన పేరు మాత్రం కాంగ్రెస్‌ రెండో జాబితాలో ప్రకటించలేదు.

దీంతో కామారెడ్డినుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను పోటీకి దించే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇక షబ్బీర్‌ అలీకి నిజామాబాద్‌ అర్బన్‌ కేటాయిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. జాబితాలో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ను పెండింగ్‌లో ఉంచడంతో పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ అర్బన్‌ టికెట్‌ ఆశించిన తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఇటీవలే ఢిల్లీకి పిలిపించింది. సీటు కేటాయింపుపై పట్టు వీడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయనకు నచ్చచెప్పారు. మహేశ్‌ గౌడ్‌ ఓకే చెప్పడంతో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ షబ్బీర్‌ అలీకి కేటాయించడానికి లైన్‌ క్లీయర్‌ అయిందని సమాచారం.

Tags:    

Similar News