తెలంగాణ కాంగ్రెస్‌లో వారి మధ్య కొలిక్కి రాని సీట్ల పంచాయతీ

తెలంగాణలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంల మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఐదేసి సీట్లు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం..

Update: 2023-10-19 12:19 GMT

తెలంగాణలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంల మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఐదేసి సీట్లు ఇవ్వాలని సీపీఐ, సీపీఎం ప్రతిపాదనలు పెడితే.. చెరో రెండేసి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కోరుకున్న సీటు.. మరొకటి వేరోచోట ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కామ్రేడ్స్అంగీకరించడం లేదు. రెండేసి సీట్లు తాము కోరుకున్న చోట ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

సీపీఎం, సీపీఐ చెరో ఐదు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరుతున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తుల అంశం జాతీయ స్థాయిలోనే కొనసాగుతోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీపీఎం, సీపీఐ నేతలతో చర్చలు జరిపి.. చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. సీపీఐ కోరుకున్న ఐదు సీట్లలో మునుగోడు లేదంటే కొత్తగూడెం ఇస్తామని తెలుపగా, చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మరో సీటు అనుకున్నట్లుగా చెన్నూరు సీటు ఇస్తామని కాంగ్రెస్చెప్పినట్టు సమాచారం. అయితే సీపీఎం కోరుకున్న ఐదు సీట్లలో మిర్యాలగూడ సీటు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. మరో సీటుపై ఎలాంటి స్పష్టత లేదు.

ఖమ్మం జిల్లాలో సీటు కోసం పీసీఎం పట్టు:

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్పనిసరిగా సీటు కావాల్సిందేనని సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీపీఎం ప్రతిపాదించిన సీట్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మధిరలో అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించగా.. పాలేరులో మాత్రమే అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు తమకు ఇవ్వాల్సిందేనని సీపీఎం జాతీయస్థాయి నుంచి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News