తెలంగాణలో 35,655 పోలింగ్‌ కేంద్రాలు.. అక్కడ 4 గంటల వరకే పోలింగ్‌

మరి కొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌. సర్వం సిద్ధం అంటోంది ఎన్నికల కమిషన్‌. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ..

Update: 2023-11-29 13:59 GMT

మరి కొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌. సర్వం సిద్ధం అంటోంది ఎన్నికల కమిషన్‌. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఏర్పాట్లను పరిశీలించారు CEO వికాస్‌ రాజ్‌. పోలింగ్‌ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందితో పాటు ఈవీఎంలను తరలిస్తోంది. అయితే ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు, ఏయే పోలింగ్ కేంద్రాలలో నాలుగు గంటల వరకే పోలింగ్ ముగియనుంది..? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఇలా తదితర విషయలను తెలుసుకుందాం.

1. గురువారం తెలంగాణవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు అధికారులు.

2. రేపటి పోలింగ్‌ కోసం ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందితో పాటు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు.

3. తెలంగాణవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో 4 వేల 400 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు.

4. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. లక్ష మంది పోలీస్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.

5. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ ఆధునిక సాంకేతికను వినియోగిస్తోంది. పోలింగ్‌ కేంద్రం, బూత్‌ల్లో ఆన్‌లైన్‌ విధానం అమలుకు రెడీ అయ్యింది.

6. ఎన్నికల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో పోలింగ్‌ కేంద్రాలు స్కూళ్లలోనే ఏర్పాటు అవుతున్నాయి. దీంతో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్‌.

7. తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. పోలింగ్‌ కోసం వెళ్లేందుకు నగరం నుంచి జనం ఊళ్లబాట పట్టడంతో బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

8. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు సీపీ సందీప్‌ శాండిల్య. ఇవాళ్టి నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

9. హైదరాబాద్ లో 15 నియోజకవర్గాల పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా మొత్తం 4 వేల 119 పోలింగ్ కేంద్రాల్లో 20వేల మంది సిబ్బందిని నియమించారు.

10. హుజూరాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి చేసిన ఉద్వేగభరిత వ్యాఖ్యలపై ఈసీ సీరియస్‌ అయ్యింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆర్వోను ఆదేశించింది.

11. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిగితే.. 13 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ గంట ముందే ముగియనుంది.

12. పలిమెల మండల కేంద్రంలో మావోయిస్టులు కరపత్రాలు వేయడంతో... పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిరాక్స్, ఇంటర్నెట్ దుకాణాల్లో తనిఖీ చేశారు.

13. పలిమెల మండలం సమస్యాత్మక ప్రాంతం కావడంతో అవాంచనీయ ఘటనలు జరగకుండా వాహనాలు, రహదారులు, కల్వర్టులను తనిఖీ చేస్తున్నారు. జిరాక్స్, ఇంటర్నెట్ దుకాణాల్లో సోదాలు చేపట్టారు.

14. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప గ్రామ సమీప అటవీ ప్రాంతంలో నిన్న లారీని తగలబెట్టారు మావోయిస్టులు. ఇది మావోయిస్టు యాక్షన్ టీంగా భావిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో చర్ల, దుమ్ముగూడెం మండల సరిహద్దు గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ఈ ఘటనతో భద్రాచలం ఏజెన్సీలో హై అలెర్ట్ నెలకొంది. దీంతో పోలీసులు మరింత అలర్ట్‌ అయ్యారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు.

Tags:    

Similar News