ఆ ముగ్గురు ఆ జిల్లా నుంచే పోటీ.. పక్కా ప్లాన్‌తో బీజేపీ

తెలంగాణలో రాజకీయ పార్టీల దూకుడు మరింతగా పెరిగిపపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

Update: 2023-10-21 11:22 GMT

తెలంగాణలో రాజకీయ పార్టీల దూకుడు మరింతగా పెరిగిపపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తునన్నాయి. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల కీలక నేతలపై ఫోకస్‌ పెట్టింది. ఎలాగైన వారిని ఓడించేందుకకు ఎత్తుగడులు వేస్తోంది. కీలకమైన నేతలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక్కడని నుంచి సగానికి పైగా.. బిసి సామాజిక వర్గానికి చెందిన నేతలు రంగంలోకి దిగుతున్నారు. దసరా తరువాత బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా త్రిముఖ పోరుగా మారితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. బీజేపీకి మంచి పట్టు ఉంది. ఈ జిల్లాలో ఒక ఎంపీ బండి సంజయ్‌తో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. అయితే.. తెలంగాణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కీలక నేతలు ఇక్కడి నుంచే బరిలోకి దిగేందుకు ప్లాన్‌ వేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. కరీంనగర్ నుంచీ బరిలోకి దిగనున్నారు. అదే విధంగా బీజేపీ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. అదే విధంగా.. అరవింద్ కోరుట్ల నుంచీ బరిలో ఉండనున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో13 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. బీఆర్ఎస్ 12 నియోజకవర్గాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచింది. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో హుజురాబాద్‌లో బీజేపీ విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనుహ్యంగా బీజేపీ విజయ ఢంకా మోగించింది. కరీంనగర్ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ తరుఫున బండి సంజయ్ విజయం సాధించారు. ఎంపీ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అయా నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టింది బీజేపీ. ముఖ్యంగా కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి. వేములవాడ, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ కేడర్‌ కూడా పుంజుకుంది. ఇక ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.

అదే విధంగా కోరుట్ల నుంచి అరవింద్ బరిలో దిగుతూ.. పక్కనే ఉన్న జగిత్యాల నియోకవర్గంపై దృష్టి పెడుతున్నారు. ఇక్కడ భోగ శ్రావణీ… రంగంలోకి దింపమన్నట్లు తెలుస్తోంది. ఈమె.. బీసీ కావడంతో.. మెజారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఇక్కడ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు.. ఓసి అభ్యర్థులే. దీంతో.. బిసి ఓట్లతో బయటపడేందుకు ప్లాన్ చేస్తుంది.. మొత్తం…. 8 చోట్ల గట్టి పోటీ ఇచ్చి కనీసం ఐదు చోట్లనైనా విజయం సాధించేందుకు పక్కా ప్లాన్ చేస్తుంది. 

Tags:    

Similar News