Gajwel : గజ్వేల్‌లో ఎన్ని ఈవీఎంలు పెట్టాలో?

అత్యధికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి

Update: 2023-11-14 05:48 GMT

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. పరిశీలన కూడా పూర్తయింది. ఇక ఉపంహరణకు రేపటి వరకూ గడువు ఉంది. అయితే నామినేషన్లు 119 నియోజవకర్గాల్లో 4,274 నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు అందాయి. కొన్ని నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. అయితే అవి పెద్ద సంఖ్యలో లేవని అధికారులు చెబుతున్నారు. 916 మంది నామినేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరస్కరణకు గురయ్యాయి. అత్యధికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి.

అత్యధికంగా...
145 నామినేషన్లు ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే పడ్డాయి. రేపటి వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో గులాబీ పార్టీ నేతలు నామినేషన్ వేసిన వారిని బుజ్జగిస్తున్నారు. ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. వీరిలో అత్యధికమంది రైతులు తమ డిమాండ్ సాధన కోసం నామినేషన్లు వేశారు. వీరు ఉపసంహరించుకోకపోతే ఈవీఎంల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. అలాగే నారాయణపేటలో అత్యల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి. కేవలం పదమూడు నామినేషన్లు మాత్రమే పడ్డాయి.


Tags:    

Similar News