Pawan Kalyan : పవన్ వరంగల్ కు ఎన్ని గంటలకు వస్తారంటే?

నేటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు

Update: 2023-11-22 02:43 GMT

నేటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఈరోజు, రేపు ప్రచారంలో పాల్గొంటారు. ఈరోజు వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే రోడ్‌ షోలలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ తన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

రేపు కూడా ప్రచారం....
రేపు ఉదయం పదకొండు గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం సూర్యాపేట, తర్వాత దుబ్బాక నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 25న తాండూరు నియోజకవర్గంలోనూ, 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో పవన్ సభలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ, జనసేన కలసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ పవన్ ప్రచారంలో పాల్గొనకపోవడంపై వస్తున్న సందేహాలకు ఆయన నేటితో తెరదించనున్నారు.


Tags:    

Similar News