తెలంగాణకు కేంద్ర బలగాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. భద్రత దృష్ట్యా ..

Update: 2023-10-23 08:47 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. భద్రత దృష్ట్యా రాచకొండ పోలీసు సిబ్బందికి సహాయంగా ఉండేందుకు ఏడు కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చాయి. ఇది తొలి విడత బలగాలు కాగా, త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు రానున్నట్లు తెలుస్తోంది. రాచకొండ పోలీస్ సిబ్బందితో కలిసి ఈ కేంద్ర బలగాలు పలు నియోజకవర్గాల్లో ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతు నిర్వహించనున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ సీపీడిఎస్‌ చౌహన్‌ తెలిపారు. పాత నేరస్తులను సైతం ఎన్నికల నేపథ్యంలో వారిని బైండోవర్ చేస్తున్నామని అన్నారు. అలాగే తనిఖీలు చేపట్టేందుకు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ నగదు, మద్యం తరలింపులో పకడ్బంధీ చర్యలు చేపడుతున్నామన్నారు. పత్రాలు లేని వాహనాలు, నగదు,బంగారాన్ని సీజ్‌ చేస్తున్నామని అన్నారు.

ఈ ఎన్నికల్లో కేంద్రం భారీ ఎత్తున బలగాలను దింపనుంది. గతంలో పదివేల కేంద్ర బలగాలు తెలంగాణ వ్యాప్తంగా భద్రత కింద ఉంటే ఈసారి దాన్ని రెట్టింపు చేస్తూ 20 కేంద్ర బలగాలను హోంశాఖ కేటాయించింది. ఒక్కో కంపెనీలో అస్సాం రైఫిల్స్ బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, శశాస్త్ర సీమా నుండి 80 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. 

Tags:    

Similar News