Priyanka Gandhi : కొడంగల్‌లో రేవంత్ ను గెలిపించండి

ల్యాండ్, శాన్డ్, వైన్ మాఫియాలతో ఈ ప్రభుత్వం కూరుకుపోయిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు

Update: 2023-11-27 11:25 GMT

priyanka vadra

ల్యాండ్, శాన్డ్, వైన్ మాఫియాలతో ఈ ప్రభుత్వం కూరుకుపోయిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రచారం ముగింపు దశకు వచ్చిందని, మూడు రోజుల్లో ఓటేస్తారని ఆమె అన్నారు. కొడంగల్ ప్రియాంక గాంధీ మాట్లాడారు. రేవంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణ కోసం వందల మంది ప్రాణత్యాగం చేశారన్నారు. ఈ దేశం కోసం మా కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పించారని తెలిపారు. ప్రాణత్యాగాలు వృధా కానివ్వవద్దని కుటుంబ సభ్యులు కోరుకుంటారని అన్నారు. పదేళ్లలో ప్రజల ఆశలు అడియాసలు చేస్తూ అవినీతికి పాల్పడ్డారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మీ ఆశలను నెరవేర్చేందుకే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.

ఐదేళ్ల భవిష్యత్....
మీరు వేసే ఓటు వల్ల ఐదేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు ప్రియాంక గాంధీ, కేసీఆర్ పనితీరును పదేళ్లుగా పరిశీలించారన్నారు. దేశమంతటా నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. ఈ రాష్ట్రంలో ధరలు ఏమైనా తగ్గాయా? అని ప్రశ్నించారు. దొరల తెలంగాణ బలపడిందని, ప్రజలు బలహీనపడ్డారని అన్నారు. ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ వికాసం కోసమే తన పోరాటమని రేవంత్ రెడ్డి తనతో తెలిపారని ప్రియాంక గాంధీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని భావించారని, కానీ అది జరగకపోతే ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కుటుంబంలోని సభ్యులకే మంత్రి పదవులు దక్కాయన్నారు.
ఆరు గ్యారంటీలను...
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులకు అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. కర్ణాటకలో అమలు చేసినట్లుగానే ఇక్కడ కూడా తొలి మంత్రి వర్గ సమావేశంలోనే ఆరు గ్యారంటీలను ఆమోదిస్తారని తెలిపారు. రైతులు అప్పుల పాలయ్యారని, దేశ చరిత్రలోనే ఫాం హౌస్ నుంచి పాలన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఆయన అన్నారు. తనకు కేసీఆర్ గురించి తెలియదు కానీ, ఆయన పనితీరు గురించి తెలుసునని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరలు తగ్గించి ఉపశమనం కల్పిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.


Tags:    

Similar News