KCR : ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త.. హెచ్చరించిన కేసీఆర్

యాభై ఏళ్ల పాలనలో గోస తప్ప అభివృద్ధి లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.

Update: 2023-11-20 11:50 GMT

యాభై ఏళ్ల పాలనలో గోస తప్ప అభివృద్ధి లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు, కరెంటు కూడా ఇవ్వలేకపోయారన్నారు. గత పథ్నాలుగేళ్లు ఉద్యమం, పదేళ్ల పాలనలో ఏం జరిగిందో చూడాలన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి టైంలో నల్లగొండ ఎలా ఉండేదో చూడాలన్నారు. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నల్లగొండ ఎలా మారిందో చెప్పాలన్నారు. నల్లగొండకు ఐటీ టవర్ కూడా వచ్చిందని కేసీఆర్ అన్నారు.

రైతు బంధు ఉండదు...
కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఉండదని, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల నుంచి పదహారు వేల రూపాయలు చేస్తామని తెలిపారు. 24 గంటలు కరెంట్ కావాలన్నా భూపాల్ రెడ్డి గెలవాలన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. బోర్ల కింద వ్యవసాయం చేసుకునేటోల్లు నేడు పరిస్థితి ఎలా మారిందో గమనించాలన్నారు. ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్త అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ నుంచి ఇక్కడి నేతల వరకూ తాము అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని చెబుతున్నారన్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ పాత కొట్లాటలు తప్పవని ఆయన అన్నారు.
ధరణి లేకపోతే...
రైతు బంధు డబ్బులు ధరణి వల్లనే నేరుగా రైతుల అకౌంట్‌లలోకి డబ్బులు వచ్చి పడతాయని అన్నారు. గతంలో నల్లగొండను దత్తత తానే తీసుకుంటానని చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఓటు తలరాత మారస్తుందన్నారు. కర్ణాటకలో ఇరవై గంటలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడు గంటలే ఇస్తుందన్నారు. మోటారు కాలితే ఎన్ని అవస్థలు పడాలో గుర్తించాలన్నారు. నల్లగొండ పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, జరుగుతున్న అభివృద్ధిని జార విడుచుకోవద్దని ఆయన కోరారు. ప్రజల మధ్య ఉండి పొద్దునలేస్తే మీ మధ్య తిరిగేటోళ్ల కావాలా? హైదరాబాద్‌లో ఉండేవాళ్లు కావాలో? ఆలోచించుకోవాలని కేసీఆర్ కోరారు. ఆటో రిక్షా నడిపే వాళ్లకు పర్మిట్, ఫిట్ నెస్ సర్టిఫికెట్లను రద్దు చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News