Kamareddy: అందరి చూపు కామారెడ్డిపైనే.. మారిన ఎన్నికల ముఖచిత్రం

Telangana Election: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.

Update: 2023-11-16 03:23 GMT

Telangana Election: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ సారి చాలా మంది సీట్లు తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వస్తుందనుకున్న నేతలకు నిరాశ ఎదురైంది. సీటు దక్కని చాలా మంది నేతలు ఇతర పార్టీలలోకి మారుతున్నారు. మరి కొరి కొందరు పార్టీ బుజ్జగింపులతో చేసేదేమి లేక సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు తెలంగాణలో అందరి చూపు కామారెడ్డిపైనే ఉంది. పాత అభ్యర్థులు పోయి కొత్త అభ్యర్థులు తెరపైకి రావడం అందరి చూపు ఆకర్షిస్తోంది కామారెడ్డి.

మూడు దశాబ్దాలుగా..

దాదాపు మూడు దశాబ్దాలుగా తమ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న వారు ఇప్పుడు నియోజకవర్గానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వా.. నేనా అన్నట్లు తలపడిన వారు ఇప్పుడు పోటీలో నిలువకుండా పోయారు. పార్టీ పెద్దల కోసం తమ తమ సీటును సైతం వదులుకునే పరిస్థితి ఏర్పడింది. అటు బీఆర్‌ఎస్‌ నుంచి గంప గోవర్ధన్‌, కాంగ్రెస్ నుంచి షబ్బీఆర్‌ అలీలు తమ సీటును వదులుకున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌కు పోటీ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. అటు బీజేపీ నుంచి నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ వెంకట రమణా రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజకీయ ఉద్ధండులు బరిలో నిలవడంతో ఇప్పుడు ఈ నియోజకవర్గం తెలంగాణలోనే ఈ జిల్లాపై అందరి చూపు ఉంది. మరి ఈ హాట్‌ సీట్‌ కామారెడ్డిలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు వేచి చూడాలి.

పెద్దల కోసం సీట్ల త్యాగం..

ఇప్పుడు ఇద్దరు కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో కామారెడ్డి ఎన్నికల ముఖచిత్రమే మారిపోయింది. నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ నేత గంపగోవర్ధన్‌కు ఉంది. ఇక 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్‌ అలీ రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పార్టీ పెద్దలు ఇక్కడి నుంచే పోటీ చేయడంతో అటు షబ్బీర్‌అలీ, ఇటు గంపగోవర్ధన్ పోటీ నుంచి తప్పుకున్నారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన గంపగోవర్ధన్‌ సింగిల్‌ విండో చైర్మన్‌గా టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

1994లో మొదటి సారిగా కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీఆర్‌ అలీపై గంపగోవర్ధన్‌ గెలుపొందారు. 2009 నుంచి 2018 వరకు గంప గోవర్ధన్‌-షబ్బీర్‌ అలీ మధ్య పోటీ కొనసాగింది. ఆ మూడు సార్లు కూడా గంపగోవర్ధనే గెలచినా ఇద్దరి మధ్య గట్టి ఫైటే నడచింది. మాచారెడ్డి మండలానికి చెందిన షబ్బీర్‌అలీ యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి షబ్బీఆర్‌అలీ కామారెడ్డి నియోజకవర్గం కేంద్రంగానే సీనియర్‌ నేతగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కామారెడ్డిలో మూడు దశాబ్దాలుగా ప్రత్యర్థులు పార్టీలు మారలేదు. ఈ సారి సీన్‌ అంతా మారిపోయింది. ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదీ ఏమైనా కామారెడ్డిలో అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డిలు బరిలో దిగడంతో ఇద్దరు నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News