Ayodhya : అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి. లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరగనున్నాయి. రామ మందిరంలో బాలరాముడికి ప్రత్యేక అభిషేకం, మధ్యాహ్నం 12:27 గంటలకు సూర్యకిరణాలతో సూర్యతిలకం, మరియు శోభాయాత్రలు ఈ వేడుకల ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
ఐదు వందల ఏళ్ల తర్వాత...
500 ఏళ్ల తర్వాత నూతన మందిరంలో జరుగుతున్న ఈ వేడుకల కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తుతున్నారు. రామ్ లల్లా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గంటల సమయం దర్శనం కోసం వేచి చూడాల్సి వస్తుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.