అఖలపక్ష భేటీలోనే అజెండా ఖరారు

సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కొద్దిసేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ప్రారంభమయింది.

Update: 2021-11-28 08:16 GMT

సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కొద్దిసేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ప్రారంభమయింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అజెండాను ఇందులో ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్ మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలపై చర్చించాలని పట్టుబడుతుంది. కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ పై కూడా ఈ సమావేశాల్లో చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

హాజరయిన నేతలు....
ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరుపున మంత్రులు రాజ్ నాధ్ సింగ్, పియూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాలాలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, అథీర్ రంజన్, ఆనందశర్మ హాజరయ్యారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ లు హాజరయ్యారు. రేపటి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News