ఆ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్

ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని అభిప్రాయపడింది

Update: 2021-12-02 08:19 GMT

ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని అభిప్రాయపడింది. ప్రభుత్వం పైకి ఎన్ని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలో వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదని, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఎన్ని చర్యలు చేపట్టినా?
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిందని అనేక సంస్థలు, నిపుణులు చెబుతున్నా పట్టించుకోడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చర్యలు చేపట్టామని ప్రభుత్వం కొన్ని వారాల నుంచి చెబుతున్నదని, కానీ కాలుష్యం మాత్రం తగ్గడం లేదని పేర్కింది. ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న అభిప్రాయానికి రావాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కాలుష్యంపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది.


Tags:    

Similar News