భారీగా తగ్గిన బంగారం ధర

దేశ వ్యాప్తంగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈరోజు పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వదంల నుంచి ఐదు వందల వరకూ తగ్గింది

Update: 2022-01-28 01:30 GMT

బంగారం అంటేనే మగువలు మక్కువ అంతా ఇంతా కాదు. కాసు బంగారం అయినా కొనుగోలు చేయాలని మహిళలు తహతహలాడుతుంటారు. తమకు ఇష్టమైన డిజైన్లు ఊరిస్తుండటం ఇందుకు కారణం కావచ్చు. మరోవైపు బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారు అనేక మంది ఉన్నారు. కష్టకాలంలో బంగారం ఆదుకుంటుందన్న భావనతో ఎక్కువ మంది డబ్బును కూడబెట్టి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

వెండి కూడా....
దేశ వ్యాప్తంగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈరోజు పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వదంల నుంచి ఐదు వందల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,500 రూపాయలుంది. అలాగే 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,640 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా చాలా వరకూ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర మార్కెట్ లో 67,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News