Encounter : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఇరవై మంది మావోల మృతి

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇరవై మంది మావోయిస్టులు మరణించారు

Update: 2025-05-21 05:35 GMT

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఇరవై మంది మావోయిస్టులు మరణించారు. భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరవై మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తుంది. మరికొందరికి గాయాలయ్యాయి.

మృతుల సంఖ్య మరింత...
ఛత్తీస్ గఢ్ లోని మాడ్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం రావడంతో భద్రతాదళాలు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఆపరేషన్ లో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరికొన్ని వివరాలు అందాల్సి ఉంది. పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉంది.


Tags:    

Similar News