Encounter : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇరవై మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇరవై మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరవై మంది మావోయిస్టులు మరణించారని, అందులో పదకొండు మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తయిందని పోలీసు అధికారులు తెలిపారు.
కొన్ని మృతదేహాలకు..
చట్టపరమైన లాంఛనాలు పూర్తయ్యాక మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. మృతదేహాలను గుర్తించే పనిలో భద్రతాదళాలున్నాయి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నామని అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఇటీవల కాలంలో వందల సంఖ్యలో మావోయిస్టులు భద్రతదళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో మరణించారు. ఈ ఎన్ కౌంటర్ తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బేనని చెప్పాలి.