ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ - పది మంది మావోల మృతి
ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు
ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్ గడ్ - ఒడిశా సరిహద్దులోని గరియా బంద్ జిల్లాలో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఘటన జరిగింది. అయితే నిన్నటి నుంచి ఎదురు కాల్పులు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేడు భద్రతా దళాలు మావోయిస్టుల కోసం వెతుకుతుండగా ఈరోజు పది మృతదేహాలు లభ్యమయినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన జవాన్ ను...
చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే గాయపడిన జవాన్ ను హెలికాపర్ట్ లో రాయపూర్ కు తరలించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇంకా మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.