2023లో ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన పదాలు ఏంటో తెలుసా?

ఇక 2023 సంవత్సరం ముగియబోతోంది. ఈ ఏడాది ముగియనున్న నేపథ్యంలో గూగుల్‌లో ఎక్కువ ఎలాంటి పదాలను సెర్చ్‌ చేశారనే విషయాలను వెల్లడిస్తుంటుంది గూగుల్‌.

Update: 2023-12-14 04:52 GMT

Google Year in Search 2023

Google Search: ఇక 2023 సంవత్సరం ముగియబోతోంది. ఈ ఏడాది ముగియనున్న నేపథ్యంలో గూగుల్‌లో ఎక్కువ ఎలాంటి పదాలను సెర్చ్‌ చేశారనే విషయాలను వెల్లడిస్తుంటుంది గూగుల్‌. అలా ఈ సంవత్సరంలో గూగుల్‌లో ఎలాంటి పదాలు ఎక్కువ సెర్చ్‌ చేశారో చూద్దాం. ఈ ఏడాది అందరికి ఆకర్శించిన అంశం చంద్రయాన్ 3. ఈ ప్రయోగం చేపట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేసింది భారత్‌. గూగుల్‌లో ఎక్కువ సెర్చ్‌ చేసిన పదాల్లో చంద్రయాన్-3 ఒకటి. ఆ తరువాత కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కువగా గూగుల్ సర్చ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి సంబంధించిన విషయాలు కూడా సెర్చ్‌ చేశారట. బడ్జెట్ 2023, టర్కీ భూకంపం, ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన వార్తలను ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2023లో ఎక్కువగా గూగుల్‌ సెర్చ్‌ చేసిన పదాలు

♦ చంద్రయాన్-3 (Chandrayan-3)

♦ కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Election Results)

♦ ఇజ్రాయెల్ వార్తలు (Israel News)

♦ సతీష్ కౌశిక్ (Satish Kaushik)

♦ బడ్జెట్ 2023 (Budget 2023)

♦ టర్కీ భూకంపం (Turkey Earthquake)

♦ అతిక్ అహ్మద్ (Atiq Ahmed)

♦ మాథ్యూ పెర్రీ (Matthew Perry)

♦ మణిపూర్ వార్తలు (Manipur News)

♦ ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident)

♦ జీ20 అంటే ఏమిటి? (What is G20)

♦ యూసీసీ అంటే ఏమిటి? (What is UCC)

♦ చాట్‌జీపీటీ అంటే ఏమిటి? (What is Chat GPT)

♦ హమాస్ అంటే ఏమిటి? (What is hamas)

♦ సెంగోల్ అంటే ఏమిటి ? (What is Sengol)

♦ 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత (What is on 28 September 2023)

♦ ఇన్‌స్టాగ్రామ్‌ థ్రెడ్‌ అంటే ఏమిటి? (What is threads in Instagram)

ఇవే కాకుండా ఎన్నో పదాలు గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News