2023 Rewind : ఈ ఏడాది స్క్రీన్ పై కనిపించని హీరోలు వీరే..

ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాని హీరోలు ఎవరు..? వచ్చినా పెద్ద సత్తా చూపలేని హీరోలు ఎవరు..?

Update: 2023-12-17 06:48 GMT

2023 Rewind

2023 Rewind : ఈ ఏడాది టాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఒకరి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అవి పెద్దగా సత్తా చూపించలేకపోయాయి. ఇంతకీ అసలు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాని హీరోలు ఎవరు..? వచ్చినా పెద్ద సత్తా చూపలేని హీరోలు ఎవరు..?

రామ్ చరణ్..
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ షూటింగ్ ని 2021 లోనే స్టార్ట్ చేశారు. కానీ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్ 2 కూడా చేస్తుండడంతో గేమ్ ఛేంజర్ లేటు అవుతూ వచ్చింది. దీంతో ఈ ఏడాది చరణ్ నుంచి సినిమా రిలీజ్ లేకుండా చేసింది.
అల్లు అర్జున్..
పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా ఈ ఏడాది కనిపించలేదు. 2021లో రిలీజ్ అయిన పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో.. సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకనే పుష్ప 2ని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. 2024 ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది.
ఎన్టీఆర్..
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్.. 'దేవర' షూటింగ్ ని మొదలు పెట్టడంలో చాలా సమయం తీసుకున్నారు. RRRతో ఎన్టీఆర్ కి వచ్చిన ఫేమ్ ని దృష్టిలో పెట్టుకొని దేవర స్టోరీ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని చాలా టైం తీసుకోని జాగ్రత్తగా చేశారు. అందుకనే ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి మరో మూవీ రిలీజ్ లేకుండా చేసింది. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.
మహేష్ బాబు..
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం'. ఈ ఏడాది థియేటర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మహేష్ కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని బాధాకర పరిస్థితులు వల్ల మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కావడానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
నాగార్జున..
ఘోస్ట్ సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకున్న నాగార్జున.. చాలా గ్యాప్ తీసుకోని ‘నా సామిరంగ’ అనౌన్స్ చేశారు. మలయాళ మూవీకి రీమేక్ వస్తుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి రావడానికి సిద్దమవుతుంది. ఈ ఏడాది వెండితెర పై కనిపించకపోయినా బిగ్‌బాస్ ద్వారా బుల్లితెరపై కనిపించారు.
వెంకటేష్..
తన కెరీర్ లో 75వ సినిమాగా వస్తున్న 'సైంధవ్'ని అనౌన్స్ చేయడానికి వెంకటేష్ చాలా గ్యాప్ తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది వెండితెరపై కనిపించలేదు. అయితే బుల్లితెరపై 'రానా నాయుడు'తో కనిపించారు. కాగా 'సైంధవ్' కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.
అలాగే శర్వానంద్, రానా కూడా ఈ ఏడాది వెండితెరపై కనిపించలేదు. ఇక ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్దకి చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ప్రభాస్ తమ సినిమాలను తీసుకు వచ్చిన అవి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నా.. చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం కాదు. భోళా శంకర్, బ్రో, ఆదిపురుష్ సినిమాలు భారీ ప్లాప్స్ ని అందుకున్నాయి.


Tags:    

Similar News