Year Eender-2023: గూగుల్‌లో ఎక్కువగా ఎలాంటి ఫుడ్‌ కోసం సెర్చ్‌ చేశారో తెలుసా?

2023 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. పాత ఏడాది మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు

Update: 2023-12-22 15:29 GMT

2023 rewind

2023 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. పాత ఏడాది మరికొన్ని రోజుల్లోనే ముగియనుంది. కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు ఇప్పుడే ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే 2023 ఏడాది ముగుస్తున్న సమయంలో ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది ఏం సెర్చ్‌ చేశారన్నదానిపై ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రస్తుతం ఏ చిన్న సమాచారం కోసమైనా గూగుల్‌లో వెతికేస్తున్నారు. ఎడ్యుకేషన్‌ మొదలు చివరికి వంటల వరకు ఆన్‌లైన్‌లోనే సెర్చ్‌ చేస్తున్నారు. చాలా మంది గూగుల్‌ను నమ్ముకుంటున్నారు. అయితే ప్రతి ఏడాది గూగుల్‌ ఎలాంటి పదాలు సెర్ఛ్ చేశారన్న విషయాన్ని గూగుల్‌ విడుదల చేస్తుంటుంది. అలాగే ఈ 2023లో కూడా గూగుల్‌లో ఎక్కువ ఎలాంటి పదాలు సెర్చ్‌ చేశారన్న విషయాలను విడుదల చేసింది. ఈ క్రమంలోనే గూగుల్‌లో ఆహారానికి సంబంధించి ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు తేలింది. అందులో ఫుడ్‌కు సంబంధించిన ఎలాంటి పదాలు సెర్చ్‌ చేశారో తెలుసుకుందాం.

గూగుల్‌ సెర్చ్‌ హిస్టరీ ఆధారంగా తెలిపిన ఈ వివరాల ప్రకారం.. ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతాన్నారని వెల్లడించింది. ఈ క్రమంలోనే గూగుల్ 2023లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన ఆహారాల జాబితాను విడుదల చేసింది గూగుల్‌. రుచితో పాటు ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారని స్పష్టం చేసింది.

☛ 2023లో మిల్లెట్స్‌ గురించి ప్రజలు ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తిచూపించారట. వీటిలో ప్రముఖంగా బార్లీ, కొడ్రా, రాగి, కుట్కి వంటి వాటి గురించి వెతికారు. అలాగే మిలెట్స్‌తో తయారు చేసుకునే వంటకాల గురించి కూడా ఎక్కువగా వెతికారు. దీనిబట్టి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగినట్లు స్పష్టమవుతోంది.

☛ గూగుల్‌లో అత్యధికంగా వెతిక ఆహార పదార్థాల్లో అవకాడో ఒకటి. అవకాడలో విటమిన్లు, ఖనిజాలు, హెల్తీ కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అలాగే ఇందులోని పొటాషియం, ఫైబర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ కారణంగానే గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌లో అవకాడో నిలిచింది.

☛ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన ఫుడ్‌ ఐటమ్స్‌లో మటన్‌ రోగన్‌ జోష్‌ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఫుడ్‌ ఐటమ్‌ కశ్మీరీ వంటకం. నాన్‌ లేదా రైస్‌తో తినే ఈ స్పైసీ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ ఫుడ్‌ను 2023లో గూగుల్‌లో ఎక్కువసార్లు సెర్చ్‌ చేశారు.

☛ 2023లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాలలో కాథి రోల్స్‌ 4వ స్థానంలో నిలిచింది. చికెన్‌ లేదా కూరగాయలతో తయారు చేసే ఈ రోల్స్‌కు ఫుడ్‌ లవర్స్‌ ఫిదా అవుతారు. కోల్‌కతాకు చెందిన ఈ స్పెషల్‌ ఫుడ్‌ చపాతిని రోల్‌గా చేసి అందులో చికెన్‌ లేదా వెజ్‌ కర్రీస్‌తో వడ్డిస్తారు. వీటిని చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తారు.


Tags:    

Similar News