అయోధ్య రామమందిరం 3డి వీడియో విడుదల

అయోధ్యలో రాముడు జన్మించిన ప్రాంతంలో ప్రస్తుతం రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత

Update: 2022-01-14 12:35 GMT

అయోధ్యలో రాముడు జన్మించిన ప్రాంతంలో ప్రస్తుతం రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈనాటికి రామమందిర నిర్మాణం సార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ మందిర నిర్మాణం 3డి వీడియోను విడుదల చేసింది.

4 నిమిషాల 41 సెకన్ల నిడివి గల ఈ 3డి వీడియోలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయంలోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి వెళ్లే రోడ్డుమార్గం తదితరాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 2023 డిసెంబరు నాటికి ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి రానుంది.
Full View


Tags:    

Similar News