Ayodhya : అయోధ్యలో అపూర్వ ఘట్టం పూర్తి.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది చూశారో తెలుసా?

అయోధ్యలో మహత్తర ఘట్టం పూర్తయింది. నిర్ణయించిన ముహూర్తానికే అయోధ్య రామమందిరంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరిగింది.

Update: 2024-01-22 07:06 GMT

అయోధ్యలో మహత్తర ఘట్టం పూర్తయింది. నిర్ణయించిన ముహూర్తానికే అయోధ్య రామమందిరంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదాగ ప్రాణ ప్రతిష్ట జరిగింది. మోదీ ముందుగానే ఆలయానికి చేరుకుని ఆలయమంతా కలియ దిరిగారు. పత్ర్యేకంగా పూజాద్రవ్యాలతో ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ మహత్తర ఘట్టానికి అనేక మంది సాక్షులుగా నిలిచారు. మధ్యాహ్నం 12.29 నుంచి 12.30 మధ్య కాలంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించారు. నిర్ణయించిన ముహూర్తానికే ప్రాణ ప్రతిష్టను ఆలయ పూజారులు నిర్వహించారు.


గర్భగుడిలో...

గర్భగుడిలో కూర్చుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదకొండు రోజుల నుంచి అనుష్టానం నిర్వహించిన ప్రధాని మోదీ ఈరోజు విగ్రహ ప్రతిష్టను చేశారు. గర్భగుడిలో వేదమంత్రాల మధ్ర ప్రాణ ప్రతిష్ట క్రతువును నిర్వహించారు. దాదాపు అరగంట సేపు ఈ పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆలయం వెలుపలి నుంచి కాకుండా దేశ ప్రజలంతా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాణప్రతిష్టాపన పూజలో పథ్నాలుగు జంటలు పాల్గొన్నాయి. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అభిజిత్ లగ్నంలో నిర్ణయించిన ముహూర్తానికి ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రాణప్రతిష్టలో ప్రధాన యజమానిగా మోదీ వ్యవహరించారు.

అనేక మాధ్యమాల్లో...
ప్రపంచ వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్‌లో ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించారు. జాతీయ, అంతర్జాతీయంగా కూడా లైవ్ టెలికాస్ట్ కావడంతో కోట్లమంది ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించారు. సోషల్ మీడియా, టీవీల్లో ఈ వీక్షకుల సంఖ్య పదుల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. మోదీ బలరాముడి పట్టుపీతాంబరాలు, ఛత్రం తీసుకుని ఆలయంలోకి ప్రవేశించారు. తర్వాత ఆలయపూజరులు ఆయన చేత ప్రాణ ప్రతిష్ట పూజలు నిర్వహించారు. మోదీ వెంట ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్‌లు కూడా ఉన్నారు. దేశమంతా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలో దేశం దద్దరిల్లింది. రామ్ లాలా ప్రాణప్రతిష్ట జరిగిన వేళ దేశమంతా ఆధ్మాత్మిక వాతావరణం సంతరించుకుంది. భాణాసంచాలు పేల్చి ప్రజలు అనేక చోట్ల సంబరాలు చేసుకున్నారు.


Tags:    

Similar News