జక్కన్న రివ్యూ

Update: 2016-07-29 05:27 GMT

నటీనటులు : సునీల్, మన్నారా చోప్రా..

సంగీతం : దినేష్

నిర్మాత : ఆర్. సుదర్శన్ రెడ్డి

దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ

రేటింగ్: 1.5/5

కమెడియన్ గా మంచి ఫాలోయింగ్ వున్న సునీల్ హీరో అవుతానంటూ బయలుదేరాడు. హీరో గా తీసిన 'అందాల రాముడు, మర్యాద రామన్న' వంటి సినిమాలు హిట్ అవ్వగానే ఇంకా హీరో గానే బావుంది అని అలాగే సెటిల్ అయ్యి పోయాడు, కానీ కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తాజాగా వచ్చిన 'కృష్ణాష్టమి' కూడా ఘోరం గా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు 'జక్కన్న' తోనైనా ఒక హిట్ తెచ్చుకోవాలని ఆశగా ఈ రోజు (29/07/16) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో ఫైట్స్ సీన్స్ తక్కువగా వుంది తాను నమ్ముకున్న ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ అవకాశం ఇచ్చాము అని.. ఈ సినిమా పూర్తి కామెడీతో తీశామని సునీల్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. మరి కామెడీకి పెద్ద పీట వేసి ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న సునీల్ కి 'జక్కన్న ' ఏ విధం గా హెల్ప్ అయ్యిందనే విషయం సమీక్షలో తెలుసుకుందాం.

కథ: గ‌ణేష్ (సునీల్ ) అనే కుర్రాడి క‌థ ఇది. తన‌కెవ‌రైనా సాయం చేస్తే.. తిరిగి సాయం చేసేంత వ‌ర‌కూ వ‌ద‌ల‌డు. చిన్న‌ప్పుడు బైరాగి (క‌బీర్ ఖాన్‌) సాయం వ‌ల్లే తాను బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాన‌న్న విష‌యం తెలుసుకొంటాడు గ‌ణేష్‌. అప్ప‌టి నుంచీ బైరాగి ఎవ‌రు? ఎక్క‌డున్నాడు? త‌న‌కెలా సాయం చేయాలి? అనే విష‌యాలే ఆలోచిస్తుంటాడు. ఆ క్ర‌మంలో స‌హ‌స్ర (మ‌న్నార చోప్రా) ప‌రిచ‌యం అవుతుంది. త‌న‌ని ప్రేమిస్తాడు గ‌ణేష్‌, స‌హ‌స్ర ఎవ‌రో కాదు.. బైరాగి కూతురన్న విష‌యం తెలుస్తుంది. బైరాగి ఓ కిల్ల‌ర్‌. అయినా స‌రే.. గ‌ణేష్ బైరాగికి సాయం చేయాల‌నుకొంటాడు. కానీ గ‌ణేష్ వ‌ల్లే బైరాగికి కొత్త స‌మ‌స్య‌లొస్తాయి. దాంతో గ‌ణేష్‌పై ప‌గ పెంచుకొంటాడు బైరాగి. సాయం చేద్దామ‌నుకొని వెళ్లిన గ‌ణేష్ త‌న ప్రాణాల‌పై తెచ్చుకొంటాడు. ఆ త‌ర‌వాత ఏమైంది? అనేదే జ‌క్క‌న్న క‌థ‌.

పనితీరు:సునీల్ సినిమాల్లో కామెడీ డోసు బాగా త‌గ్గిపోతోంది. దర్శకుడు ఆకెళ్ళ వంశి కృష్ణ ఈ సినిమాని ఒక కామెడీ ఎంటర్ టైనర్ గా తీద్దామని అనుకున్నాడు. కానీ దాని సినిమాగా తియ్యడం లో మాత్రం విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపిస్తుంది. క‌థ‌లో పాయింట్ బాగుంది. కొన్ని హంగులు అద్దుకొంటే ఇంకా బాగుంటుంది.ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ సి. రాం ప్రసాద్ పనితనం బాగుంది. సంగీత దర్శకుడు దినేష్ ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఆకట్టుకునేలా లేవు. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. మేకింగ్ పరంగా వంశీ కృష్ణ పెద్దగా చేసిందేమీ లేదు. ఒక్క గ‌ణేష్ పాత్ర‌కు త‌ప్ప మ‌రే క్యారెక్ట‌ర్‌కీ స్కోప్ లేదు. కేవ‌లం దిష్టిబొమ్మ‌లా నిల‌బ‌డిపోయారు. విల‌న్ క‌బీర్‌తో స‌హా. అయినా ద‌ర్శ‌కుడు రాసుకొన్న పాయింట్ రెండు గంట‌ల సినిమాగా మ‌ల‌చ‌డం క‌ష్టం. అలా మ‌ల‌చాలంటే ద‌ర్శ‌కుడికి ర‌చ‌యిత‌ల స‌హ‌కారం కావాలి. అయితే ఈ సినిమా విష‌యంలో అది అంద‌లేదు. సునీల్ త‌న స్థాయికి త‌గ్గ‌ట్టే చేశాడు. ఫైట్లు, డాన్సులూ ష‌రా మామూలే. కానీ.. కండ‌లు తిరిగిన బాడీతో కామెడీ చేయ‌డం క‌స్ట‌మ‌న్న‌ది సునీల్‌ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌న్నార్ చోప్రా కేవ‌లం గ్లామ‌ర్ షోకు మాత్ర‌మే ప‌నికొచ్చింది. అసలు సునీల్ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడో మరి ఆయనకే తెలియాలి.

ప్లస్ పాయింట్స్: సునీల్ నటన, మన్నారా అందాల ప్రదర్శన, కమెడియన్ పృథ్వి నటన

మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకుడు, కామెడి, డైలాగ్స్, సాంగ్స్, మ్యూజిక్, క్లైమాక్స్

Similar News