ఇంట్లో దెయ్యం నాకేం భయం మూవీ రివ్యూ

Update: 2016-12-30 18:55 GMT

ఇంట్లో దెయ్యం నాకేం భయం మూవీ రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, కృత్తికా జయకుమార్, మౌర్యాని, రాజేంద్ర ప్రసాద్

సంగీతం: సాయి కార్తీక్

నిర్మాత : బివిఎస్ ఎన్ ప్రసాద్

దర్శకత్వం: జి నాగేశ్వర రెడ్డి

నరేష్ మొదటి సినిమా 'అల్లరి' నుండి ఇప్పటివరకు వచ్చిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రం వరకు కామెడీ జోనర్ నే నమ్ముకుని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లరి నరేష్ తండ్రి బ్రతికున్నపుడు హీరోగా మంచి హిట్స్ సాధించిన నరేష్ చాలాకాలం నుండి హిట్ కి మొహం వాచిపోయి ఉన్నాడు. కామెడీ జోనర్ ని నమ్ముకుని తీస్తున్న సినిమాలన్నీ వరసబెట్టి ప్లాప్స్ అవడం తో నరేష్ కొంచెం నిరాశగానే వున్నాడు. అయినా ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న నరేష్ కి 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' పెద్ద సవాల్ విసిరింది. సినిమా పరంగా అది విడులయ్యాక హిట్టా ఫట్టా అనేది తెలుస్తుంది. కానీ నరేష్ సినిమాకి మోడీ దెబ్బ పడింది. నరేంద్ర మోడీ హటాత్తుగా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా రేపు రిలీజ్ అవుతుందనగా ఈ రోజు రాత్రి పెద్ద నోట్లను రద్దుచేసి పడేసాడు. ఇంకేముందు నవంబర్ ఎనిమిది విడుదల కావాల్సిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రం అప్పటినుండి వాయిదాల మీద వాయిదా పడుతూ ఎట్టకేలకి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ డైరెక్టర్ గా పేరున్న జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం పై మంచి అంచనాలే వున్నాయి. మరి నోట్ల రద్దుకు వెనక్కి తగ్గి తాయితీగా ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకులను పలకరించడానికొచ్చిన ఈ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: నరేష్ (అల్లరి నరేష్) ఒక బ్యాండ్ మేళం ట్రూప్ ని నడుపుతుంటాడు. ఈ క్రమంలోనే నరేష్ ఇందుమతి (కృత్తికా జయకుమార్) ప్రేమలో పడతాడు. అయితే ఇందుమతి పెంచుకుంటున్న దత్త పుత్రికకి అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ కి సరిపడా డబ్బులేక ఇందుమతి అవస్థలు పడుతుంది. ఇక నరేష్ ఆమెకి సహాయం చెయ్యాలనుకున్నప్పటికీ అతనిదగ్గరా అంత డబ్బులేక ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో అతనికి అనుకోకుండా ఒక ఆఫర్ వస్తుంది. మా ఇంట్లో దెయ్యం వుంది దాన్ని వదిలిస్తే నీకు పది లక్షలు ఇస్తామని చెబుతారు. అయితే నరేష్ మాత్రం దెయ్యాలు భూతాలూ ఈ రోజుల్లో ఎక్కడున్నాయి అని వారిని ఏదో విధం గా మాయ చేసి డబ్బు నొక్కేయాలని చూస్తాడు. ఇక భూత వైద్యుడి గెటప్ లో నరేష్ ఆ ఇంటికి వెళతాడు. అక్కడ ఆ బంగళాలో నిజంగానే దెయ్యం ఉంటుంది. మరి నరేష్ ఏదో ఉత్త్తిత్తి దెయ్యాన్ని తరిమికొడదామనుకుంటే అక్కడ నిజమైన దెయ్యం ఉంటుంది. మరి ఆ దెయ్యాన్ని నరేష్ ఎలా ఎదుర్కున్నాడు? ఇక పాపకి ఆపరేషన్ ఎలా చేయించాడు? అసలు ఇందుమతితో నరేష్ పెళ్లి అయ్యిందా? భూత వైద్యుడిగా నరేష్ దెయ్యం అంటూ చూసాడా? ఇక నరేష్ ని ఆ దెయ్యం బంగళాకి ఎందుకు రప్పించుకుంది? ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: అల్లరి నరేష్ కామెడీ ని పండించడం లో దిట్ట. ఇలాంటి కామెడిపాత్రకి నరేష్ ని తప్ప మరెవ్వరిని ఊహించుకోలేం కూడా మనం. ఇంతకుముందు చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రలే చేసిన నరేష్ ఇప్పుడు కూడా ఈ పాత్రలో అల్లుకుపోయాడు. ఎప్పటిమాదిరిగానే రొటీన్ గా కనిపించాడు. కానీ కొత్తగా ఏమాత్రం ట్రై చెయ్యలెదు. ఇక కృత్తికా జయకుమార్ ఇందుమతి పాత్రలో ఆకట్టుకుంది. అయితే దెయ్యంగా మాత్రం మౌర్యాని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక నటుడు రాజేంద్ర ప్రసాద్ మిగిలిన నటులు వారి పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి రొటీన్ కథతో బోర్ కొట్టించేసాడు. కథలో కొత్తదనం లేదు. కామెడీగా కూడా మెప్పించలేకపోయాడు. ఇక పూర్ స్క్రీన్ ప్లే తో సినిమాటోగ్రఫీ కూడా అలానే వుంది. ఇక పాతాళ విషయానికొస్తే సాయి కార్తీక్ మ్యూజిక్ లో విఫలమయ్యాడనే చెప్పాలి. పాటలు ఆకట్టుకోకపోగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా మెప్పించలేక పోయింది. మరి నరేష్ ఇప్పటికైనా కథల ఎంపికలో కొంచెం శ్రద్హ వహిస్తే అతను హీరోగా ఇండస్ట్రీ లో మనగలుగుతాడు. లేదా అతను కూడా అతను అన్న రాజేష్ లాగా సైలెంట్ గా ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. మరి నరేష్ కొంచెం జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేసుకుని సినిమాలు తీస్తే ఒకే లేదంటే....!

ప్లస్ పాయింట్స్: కొన్ని కామెడీ సీన్స్, నరేష్ నటన

మైనస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్టర్, మ్యూజిక్, కామెడీ

రేటింగ్: 2 .0 /5

Similar News