వి (V) మూవీ ఓటిటి రివ్యూ

నటీనటులు : నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, రోహిణి తదితరులు.ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్సంగీతం [more]

Update: 2020-09-05 05:50 GMT


నటీనటులు : నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, రోహిణి తదితరులు.
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం : అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫర్ : పి.జి.విందా
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

వి ద మూవీ నాని 25 వ సినిమానా? సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమానా? అనే కన్ఫ్యూజన్ కి తెర దించుతూ వి సినిమా నేడు ఓటిటి అమెజాన్ ప్రైమ్ నుండి నేరుగా ప్రేక్షకుల ఇంటిలోపలికి వచ్చేసింది. నాని విలన్ గా సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన వి సినిమా మార్చ్ లోనే విడుదలకావల్సింది. కానీ కరోనా తో సినిమా వాయిదాపడింది. థియేటర్స్ తెరుచుకుంటాయి.. సినిమా విడుదల చేద్దామనుకున్న నిర్మాత దిల్ రాజుకి కరోనా అడుగడుగునా షాకివ్వడంతో ఎట్టకేలకు నాని – దిల్ రాజు – ఇంద్రగంటి – సుధీర్ బాబు లు ఈ సినిమాని ఓటిటికి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు. మరి ముందు నుండి సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రచారంలో ఉన్న వి సినిమా నిజంగా సస్పెన్స్ థ్రిల్లరా? అలాగే ఈ సినిమాలో నిజంగా నాని విలనా? అనేది తెలుసుకోవాలంటే సినిమా సమీక్ష చూడాల్సిందే.

కథ: మొహరం రోజున హైదరాబాద్ లో జరిగిన మత ఘర్షణల్లో చాలామంది ఆమాయకులు ప్రాణాలు కోల్పోతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డిఎస్పీ ఆదిత్య(సుధీర్బాబు) ఆ అల్లర్లని సమర్ధవంతంగా అదుపులోకి తెస్తాడు. ఆదిత్య డీఎస్పీగా, టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తూ రౌడీ గ్యాంగ్స్ ని మత్తు బెడుతూ.. అరాచకాలకు ఆడ్డుకట్ట వేస్తూ బోలెడన్ని మెడల్స్ సాధించిన పోలీస్ ఆఫీసర్ గా క్రేజ్ తెచ్చుకుంటాడు. ఎలాంటి పోలీస్ ఆఫీసర్ కి ఒక కిల్లర్ (నాని) పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఆదిత్య టీం లోని ప్రసాద్ ని చంపి ఆదిత్యకి ఛాలంజ్ విసురుతాడు. అయితే ఆ సైకో కిల్లర్ డైరెక్ట్ గా ఆదిత్యకే ఫోన్ చేసి నేను ఇంకొంతమందిని చంపబోతున్నాను.. దమ్ముంటే ఆపు, ఆపలేకపోతే నువ్వు సాధించిన మెడల్స్, నీ జాబ్ వదిలేయాలంటూ ఛాలెంజ్ విసురుతాడు. దానికి ఆదిత్య కూడా ఛాలంజ్ ని స్వీకరిస్తాడు. ఆదిత్య విలన్ ని ట్రేస్ చెయ్యడానికి తన టీం తో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా.. వి అనే క్లూతో ఆ కిల్లర్ మల్లికార్జునాని అనే బిల్డర్ ని చంపి… ఆదిత్య కోసం కొన్ని పజిల్స్ ఇస్తాడు. అసలు వి ఎవరు? ఎందుకు మర్డర్లు చేస్తున్నాడు? ఓ ఆర్మీ ఆఫీసర్ విలన్ గా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆదిత్య వి ని ఎలా పట్టుకున్నాడు? అసలు వి ఆదిత్యకి దొరికాడా? ఆ ఛాలంజ్ లో ఆదిత్య గెలిచాడా? అనేది వి సినిమా కథ.

నటీనటులు:
పవర్ ఫుల్ డిఎస్పీ గా సిక్స్ ప్యాక్ లుక్ లో సుధీర్ బాబు ఇరగ దీసాడు. సినిమా స్టార్టింగ్ సుధీర్ బాబు ఎంట్రీని యాక్షన్ తో స్టార్ట్ అయ్యింది. సుధీర్ బాబు లుక్స్ లోను, నటనలోనూ అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ గా నాని, విష్ణు నటన గురించి ఎంత మాట్లాడిన తక్కువే. ఇంతవరకు హీరోగానే నేచురల్ నటనతో కట్టిపడేసిన నాని మొదటిసారి నెగెటివ్ షేడ్స్ తో అదరగొట్టేసాడు. మనుషులని ఎలా చంపితే ప్రాణాలు త్వరగా పోతాయో అలా చంపేటప్పుడు నాని యాంగ్రీ లుక్స్ కానీ, కామెడీ షేడ్స్ గాని అదరగొట్టేసాడు. ఇక నాని ఆర్మీ లుక్ కూడా బావుంది. సీరియస్ కామెడీతోనూ నాని అదరగొట్టేసాడు. హీరోయిన్స్ లో నివేత థామస్ సైకలాజికల్ స్టూడెంట్ గా, సుధీర్ బాబు ని లవ్ చేసే అమ్మాయిలా లుక్స్ పరంగాను, నటన పరంగాను పర్ఫెక్ట్ గా కనిపించింది. ఇక  అదితి రావు సాహెబా పాత్రలో ఒదిగిపోయింది. వెన్నెల కిషోర్ సుధీర్ బాబు రైట్ హ్యాండ్ గా కామెడీ పండించాడు. అలాగే పోలీస్ ఆఫీసర్ గాను అదరగొటాట్డు. ఇక మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
వి టైటిల్ చూసిన దగ్గరనుండి ఇదో సైకో థ్రిల్లర్ అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. దర్శకుడు ఇంద్రగంటి గతంలోనూ జెంటిల్మెన్ సినిమాని ఇలానే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకేక్కిన్చాడు. అయితే థ్రిల్లర్ సినిమా అంటే ఉత్కంఠకు గురి ఛేస్తూ తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ లేకుండా ఇంద్రగంటి వి సినిమాని తెరకేక్కిన్చాడు. వి సినిమాలో కేవలం థ్రిల్ కలిగించే అంశాలే కాదు.. రొమాన్స్, అలాగే కామెడీ కూడా ఉంది. యాక్షన్ తోనే సుధీర్ బాబు ఎంట్రీ సీన్ చాలా బావుంటుంది. ఇక నాని కూడా ఇన్స్పక్టర్ ప్రసాద్ ని చంపేటప్పుడు నాని పాత్ర రివీల్ కావడం హైలెట్. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నాని డిఎస్పీ సుధీర్ బాబు ని ఛాలెంజ్ చేసి.. సమాజంలోని చీడపురుగులు చంపేస్తుంటాడు.  నాని ఛాలంజ్ ని స్వీకరించిన సుధీర్ బాబు నాని ని పట్టుకోవడానికి రకరకాల ప్లాన్స్ వేసినా నాని ఈజీగా తప్పించుకుంటాడు.. సుధీర్ బాబు –  నివేత లవ్ ట్రాక్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఆసక్తికరంగానే ఉంది. ఇక సుధీర్ బాబు కి ముంబైలో నాని జస్ట్ మిస్ అయినా… అప్పటినుండి నాని ని వెంటాడుతుంటే సుధీర్ బాబు కి నాని డైరెక్ట్ ఛాలంజ్ చెయ్యడం, దాని కోసం క్లూస్ వదలడం, అన్ని బావున్నాయి. సెకండ్ హాఫ్ లో నాని చేసిన మర్డర్లు తో సుధీర్ బాబు ఇచ్చిన ఛాలంజ్ కి కట్టుబడి జాబ్ రిజైన్ చెయ్యడం, నాని ఫ్లాష్ బ్యాగ్, అదితి తో పెళ్లి, అలాగే నాని వలనే సుధీర్ బాబు మాల్లి జాబ్ లోకి రావడం.. క్లైమాక్స్ ట్విస్ట్ లో నాని – సుధీర్ బాబు కలిసిపోవడం అన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. మరి రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ లా కాకుండా ఇంద్రగంటి కాస్త కొత్తగా ఏ సినిమాని తెరకేక్కిన్చాడు. రొమాన్స్ – కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ లా వి ని మలిచాడు.  

సాంకేతికంగా..
సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన మ్యూజిక్ లో సాంగ్స్ ఆకట్టుకున్నప్పటికీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ నిరాశపరిచింది. థ్రిల్లర్ మూవీస్ కి ప్రాణం పోసేది ఈ నేపధ్య సంగీతమే.కానీ వి బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే రాక్షసుడు బ్యాగ్రౌండ్ స్కోర్ గుర్తుకురాక మానదు. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునెలా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లోని విజువల్స్ ను విందా చాలా సహజంగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది గాని.. ఫస్ట్ హాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.  దిల్ రాజు నిర్మాణ విలువలు చాల బాగున్నాయి. 

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News