ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటిటి రివ్యూ

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటిటి రివ్యూప్రొడక్షన్ కంపెనీ: ఆర్కా మీడియా వర్క్స్నటీనటులు : సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, చందాన కొప్పిశెట్టి,, సుహాస్ తదితరులుసంగీతం : బిజిబాల్సినిమాటోగ్రఫీ: [more]

Update: 2020-07-31 03:47 GMT

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటిటి రివ్యూ
ప్రొడక్షన్ కంపెనీ: ఆర్కా మీడియా వర్క్స్
నటీనటులు : సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, చందాన కొప్పిశెట్టి,, సుహాస్ తదితరులు
సంగీతం : బిజిబాల్
సినిమాటోగ్రఫీ: అప్పు ప్రభాకర్
ఎడిటర్: రవితేజ గిరజాల
నిర్మాత : విజయ ప్రవీణ పరుచురి, శోబు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకుడు : వెంకటేష్ మహా

కేరాఫ్ కంచర పాలెం సినిమాతో జాతీయ స్థాయిలో ఫెమస్ అయిన దర్శకుడు వెంకటేష్ మహా నుండి మరో సినిమా అనగానే అందరిలో ఆసక్తి. కేరాఫ్ కంచెర పాలెం సినిమాని అద్భుతంగా ఆకట్టుకునేలా తెరకెక్కించిన  వెంకటేష్ మహా సత్యదేవ్ హీరోగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాని తెరకేక్కిన్చాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ బంద్ నడవడంతో.. ఓటిటిలో విడుదల చేస్తామని చెప్పినప్పటినుండి. ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు.  మలయాళ హిట్ మూవీ మహేషిన్తే ప్రతీకారం మూవీకి రిమేక్ గా వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమాపై గత నెలరోజులుగా సాంగ్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచిన టీం నేడు నెట్ ఫ్లిక్క్ష్ ద్వారా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సత్య దేవ్ నటన, వెంకటేష్ మహా దర్శకత్వం పై ప్రేక్షకుల నమ్మకం ఈ సినిమా నిలబెట్టుకుందో.. లేదో… చూద్దాం. ఇక ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం…

కథ:
మహేష్(సత్య దేవ్) ఫోటోగ్రాఫర్. మహెహ్స్ తన ప్రొఫెషన్ ని ఆస్వాదిస్తూ జీవితాన్ని మూడుపువ్వులు ఆరుకాయలు అన్న రేంజ్ లో హ్యాపీ లైఫ్ ని అనుభవిస్తుంటారు. అసలు గొడవలు అంటే ఇష్టపడని మహేష్ కి ఓ గర్ల్  ఫ్రెండ్ స్వాతి (హరి చందన) ఉంటుంది.అయితే స్వాతి మహేష్ నివదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకొని మహేష్ కి దూరం అవుతుంది. స్వాతి వదిలి వెళ్ళిపోయాక మహేష్ జోగి అనే వ్యక్తితో గొడవ పడతాడు. జోగి మహేష్ ని తన ఊరి ప్రజల సమక్షంలో అవమానానికి గురి చేస్తాడు. దీనితో మహేష్ జోగిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. జోగి తో శత్రుత్వం కొనసాగుతున్న సమయంలో జోగి చెల్లెలు జ్యోతి(రూప కొడవయూర్) ప్రేమలో పడతాడు మహేష్. అసలు మహేష్ గర్ల్ ఫ్రెండ్ స్వాతి మహేష్ ని అవదిలి వేరే వ్యక్తిని ఎలా పెళ్లాడింది? మహేష్ జోగిపై ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? జోగి చెల్లెలి ప్రేమను మహేష్ ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ…

నటీనటుల నటన:
సత్య దేవ్ ఎపప్టిలాగే కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పేస్ ఎక్సప్రెషన్ లో కానీ..  ఎమోషనల్ సన్నివేశాలలో కానీ సత్య దేవ్ జీవించాడు. క్లైమాక్స్ సన్నివేశాలలలో సత్యదేవ్ నటన సహజంగా కట్టిపడేసేలా సాగుతుంది. మహేష్ సెరెక్టర్ లో చాల కూల్,గా కనిపిస్తాడు. ఇలాంటి కేరెక్టర్ కొట్టిన పిండి అని.. మరోసారి నిరూపించాడు. సత్య దేవ్ తండ్రిగా నటించిన కె రాఘవన్ కేరెక్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అయన మాస్టర్ గా  ఉత్తేజకరమైన ఉపన్యాసాలు ఇచ్చే విధానం.బావుంటుంది. నరేష్ సరే, ఇందులో సుహాస్ కామిక్ రిలీఫ్ ఇవ్వడంలో కాస్త విఫలమయ్యాడు అని చెప్పాలి. ఇక హెర్యిన్స్ ఇద్దరూ తమ తమ తమ పాత్రలను సమర్థవంతంగా పరిధిమేర నటించారు.

విశ్లేషణ:
కేరాఫ్ కంచెర పాలెం సినిమాని పల్లెటూరి వాతావరణంలో వాస్తవికతకు దగ్గరగా..అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాని తీర్చిదిద్దిన దర్శకుడు వెంకటేష్ మహా ఆ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం ఓటిటి స్టార్ సత్య దేవ్ హీరో గా వెంకటేష్ మహా ఈ  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాని తెరకేక్కిన్చాడు. కరోనా లాక్ డౌన్ తో సత్యదేవ్ సినిమాల్ని వరసగా ఓటిటిలోనే విడుదలవుతున్నాయి. బ్లఫ్ మాస్టర్, 47 డేస్ ఇలా అన్ని సినిమాలు ఓటిటి లో విడుదలైనట్టే.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా ఓటిట్ బాట పట్టింది. ఇక సినిమాలోకి వెళితే.. సహజమైన పాత్రలు, సత్య దేవ్ అద్భుత నటన తో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. మంచి కామెడీ మరియు రొమాన్స్ తో పాటు ఎమోషన్లా గా నడిచిన ఫస్ట్ హాఫ్ చాల బావుంది అనిపిస్తుంది.  ఐతే సెకండ్ హాఫ్ లో దర్శకుడికి చెప్పడానికి ఆసక్తికర అంశాలేవీ లేకుండా పోయాయి. దీనితో ఇంటర్వెల్ తర్వాత కథనం నెమ్మదించింది. నెమ్మదిగా సాగే సెకండ్ హాఫ్ లో ఆకట్టుకోని కథనం, హడావుడిగా ముగించినట్లు ఉండే క్లైమాక్స్, రొమాన్స్ పేరిట అవసరానికి మించిన సన్నివేశాలతో దర్శకుడు నిడివి పెంచేశాడు. ఇక కంచర పాలెం తో అందరి చూపు తిప్పుకున్న వెంకటేష్ మహాకి దర్శకత్వంలో జస్ట్ పాస్ మార్కులేస్తారు  ప్రేక్షకులు.

సాంకేతికంగా..
బిజిబాల్ మ్యూజిక్ పరవాలేదు. కానీ నేపధ్య సంగీతం మాత్రం అదరగొట్టేసింది.ఇక సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ మరియు అరకు అందాలు తెరపై ఆహ్లాదం చూపించడంలో కెమెరా మ్యాన్ కృషిగా ద్భుతంగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కొంచెం ఆకట్టుకొనేలా రాసుకోవాల్సింది. ఎడిటింగ్ లో చాల లోపాలున్నాయి. పది నిమిషాల వరకు నిడివి తగ్గిస్తే బాగుండు అనే భావన కలిగింది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

రేటింగ్: 3/5

Tags:    

Similar News