శకుంతలాదేవి ఓటిటి రివ్యూ (3/5)

శకుంతలాదేవి ఓటిటి రివ్యూబ్యానర్: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్నటీనటులు: విద్య బాలన్, జిషు సేన్ గుప్త, సన్యా మల్హోత్రా, అంది సడి తదితరులుమ్యూజిక్ డైరెక్టర్: సచిన్ జిగర్ – [more]

Update: 2020-08-02 05:22 GMT

శకుంతలాదేవి ఓటిటి రివ్యూ
బ్యానర్: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్
నటీనటులు: విద్య బాలన్, జిషు సేన్ గుప్త, సన్యా మల్హోత్రా, అంది సడి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: సచిన్ జిగర్ – కారం కులకర్ణి
సినిమాటోగ్రఫీ: కియోరా నకర
ఎడిటింగ్: అంతర లహరి
నిర్మాత : సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, విక్రమ్ మల్హోత్రా
దర్శకత్వం: అను మీనన్

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల శతకం మొదలై ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. బయో పిక్స్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందులోను బాలీవుడ్ లో బయోపిక్ లకు ఇంపార్టెన్స్ ఇచ్చే విద్య బాలన్ నుండి బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమాపై ఎంత క్రేజ్ ఉండాలి. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూత బడడంతో సినిమాలన్నీ వరసగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లనుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టే.. విద్య బాలన్ మెయిన్ లీడ్ లో అను మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గణిత శాస్త్ర మేధావి, హ్యూమన్ కంప్యూటర్ శకుంతల దేవి బయోపిక్ కూడా ఈ రోజు ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణిత శాస్త్రంలో మేధావి, హ్యూమన్ కంప్యూటర్ అంటూ శకుంతలాదేవిని  పొగడడమే కానీ, ఆమె ఎలా గణిత శాస్త్రంలో మేధావి అయ్యింది, ఆమెలోని మిగతా కళలు ఏమిటి అనేవి శకుంతలాదేవి బయోపిక్ లో అను మీనన్ చూపించడానికి చేసిన ప్రయత్నమే శకుంతలాదేవి బయోపిక్. మరి విద్య బాలన్ సోషల్ మీడియా ప్రమోషన్స్ తో సినిమాపై మంచి అంచనాలు, ఆసక్తి పెంచేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.

కథ:
జీవితం దుర్భరంగా మారి… పూట గడవని స్థితిలో బిక్ష మిత్ర మణి (ప్రకాష్ బేలవాడి) o సర్కస్ కంపెనీ  లో పని చేస్తుంటాడు. బిక్ష మిత్ర తన కూతురు శకుంతలాదేవి(విద్య బాలన్) చిన్నప్పటినుండే గణితంలో అపారమైన తెలివితేటలున్న కూతురు తో గణిత ప్రదర్శనలివ్వడం మొదలుబెడతాడు. కనీసం స్కూల్ కి కూడా వెళ్లని శకుంతలాదేవి తండ్రి మార్గదర్శకత్వంలో గణితంలో జీనియస్ గా ఎదుగుతుంది. ఆ నోటా ఈనోటా శకుంతలాదేవి పేరు మార్మోగిపోతోంది. తర్వాత లండన్ వెళ్లిన శకుంతల అక్కడ మరింత పరిజ్ఞానం సాధించడంతో పాటు, అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తుంది. శంకుతల పరితోష్ బెనర్జీ(జిష్షు సేన్ గుప్త) ని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కూతురు అను( సన్యా మల్హోత్రా) పుట్టిన తరువాత భర్తను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. ఐతే కొంతకాలానికి కూతురు అను కూడా శకుంతలను వదిలేసి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను ఎలా ఎదుర్కొంది? శకుంతలాదేవి  ఎలా భర్త, కూతురు దగ్గరకు చేరింది? అనేది మిగతా కథ..

నటీనటుల నటన:
శకుంతల దేవి పాత్రకి విద్య బాలన్ సూట్ అవుతుందో లేదో అనుకున్నవారికి.. విద్యా బాలన్ తప్ప శకుంతలాదేవి పాత్ర ఎవరు చేసిన రక్తి కట్టేది కాదు అని చెబుతారు. విద్యా బాలన్ నటన గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పుకునేది కాదు. బయో పిక్ పాత్రలకు విద్యనే పెట్టింది ఎప్రూ అనేలా ఉంది. వెండితెర మీద ఎక్కడా విద్యా బాలన్ కనిపించదు. శకుంతలాదేవినే నే కనబడుతుంది. వివిధ దశల వారీగా సాగే పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ విద్యాబాలన్ నటనతో కట్టిపడేస్తుంది. హ్యూమర్, కోపం, లెక్కచేయని తనం వంటి అనేక ఎమోషన్స్ ఆమె బాగా పండించారు. క్లైమాక్స్ సన్నివేశాలు మరియు కూతురుతో వచ్చే కాంబినేషన్ సీన్స్ లో విద్యా నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. శకుంతలాదేవి కూతురు పాత్రధారి సన్యా మల్హోత్రా ఆకట్టుకునేలా ఉంది. భర్త గ జిష్షు సేన్ గుప్త ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధిమేర నటించారు.

విశ్లేషణ:
గణిత మేధావి శకుంతల దేవి అంటే.. హీరోయిజం ఉండదు. ఇప్పటివరకు తెరకెక్కిన బయోపిక్ లలో హీరోయిజం ఎలివేట్ చెయ్యడానికి.. కొంత కల్పిత కథను యాడ్ చేస్తుండేవారు దర్శకులు. కానీ శకుంతలాదేవి బయోపిక్ అలా కాదు అన్నిటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. దర్శకురాలు అను మీనన్ ఈ శకుంతలాదేవి బయోపిక్ ని ఆమె కూతురు అనుపమ బెనర్జీ దృష్టి కోణం నుండి తెరకెక్కించింది. ఫస్ట్ హాఫ్ లో శకుంతలాదేవి చిన్నప్పటినుండి గణితంలో ఎంత మేధావో… ఆమె యొక్క ప్రతిభని తండ్రి ప్రోత్సహించడం, ఆమె ఘనీయటంలో ఇచ్చే ప్రదర్శనలు, లెక్కల్లో సూపర్ కంప్యూటర్ కానన్ ఎక్కువ స్పీడు ఉన్న శకుంతల దేవి పేరు ప్రఖ్యాతలు అన్నిటితో ఫస్ట్ హాఫ్ చక్కగా సాగిపోతుంది. సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం నెమ్మదించిన భావన కలుగుతుంది. శకుంతలాదేవి జీవితంలో ఏర్పడిన ఇబ్బందులు, ఆమె వాటిని ఎదుర్కొన్న విధానం మరికొంత ఎఫెక్టివ్ గా తీయాల్సింది. శకుంతలాదేవి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు. శకుంతలాదేవి – కూతురు మధ్యలో సాగే ఎమోషనల్ సంభాషణలు ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే సినిమా ప్రారంభం నుండి స్లోగా సాగుతుంది.    మొత్తంగా శాకుంతలాదేవి తల్లికూతరు మధ్య నడిచే ఓ ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. ఆకట్టుకొనే కథనం, విద్యాబాలన్ అద్భుత నటన, హ్యూమర్ అండ్ ఎమోషన్స్ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తూ ముందుకు తీసుకెళతాయి. అయితే కమర్షియల్ హంగులు లేని శకుంతలాదేవి జీవితాన్ని బయోపిక్ గా తీయడం అనేది పెద్ద సాహసమే అయినప్పటికి.. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ బయోపిక్ ని మెచ్చి తీరాల్సిందే.

రేటింగ్ 3 .0/5

Tags:    

Similar News