సై రా కోసం కాంప్రమైజ్ కానంటున్నాడు!!

Update: 2018-09-11 08:27 GMT

ఈ మధ్యన టాలీవుడ్ సినిమాలన్నీ 100 కోట్ల క్లబ్బుని అలవోకగా అందుకుంటున్నాయి. అత్తారింటికి దారేది, మగధీర, శ్రీమంతుడు, రంగస్థలం ఇలా టాలీవుడ్ కే పరిమితమైన సినిమాలు 100 కోట్ల క్లబ్బుని ఈజిగా దాటేస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా విడుదలైన బాహుబలి అయితే చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా భారీ బడ్జెట్ తో రాజమౌళి ఇండియా వైడ్ గా తెరకెక్కించి విడుదల చేసి 1500 కోట్ల క్లబ్బులో నిలిచేలా చేసాడు. ఇక బాహుబలి దగ్గరనుండి టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు క్రేజు పెరగడమే కాదు.... వరుసగా పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ తో సినిమాలను దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో, సై రా నరసింహారెడ్డి సినిమాలు ఆ దారిలోనే వెళుతున్నాయి. చిరు హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో సై రా నరసింహారెడ్డి సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నాడు.

యాక్షన్స్ సీన్స్ కు యాభై కోట్లు.....

అయితే సై రా బడ్జెట్ ఇంతని.... చెప్పడానికి లేదుకానీ.. ఎంతవరకు డిమాండ్ చేస్తే అంత పెట్టుబడి పెడతానని రామ్ చరణ్ బహిరంగంగా చెప్పడమే కాదు.. సురేందర్ రెడ్డి కి అన్ని అధికారాలు ఇచ్చి సిట్యువేషన్ కి తగ్గ డిమాండ్ ని బట్టి సై రా కోసం ఖర్చు పెడుతున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకుని జార్జియా పయనమైన సై రా నరసింహారెడ్డి టీమ్ అక్కడ సినిమాలోని అతి కీలకమైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌కి రామ్ చరణ్ అక్షరాలా యాభై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాడనే టాక్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పి మరీ జార్జియాకి కి పంపించారని సమాచారం. ఖర్చు కంటే సినిమా క్వాలిటీ ముఖ్యమని మెగా ఫ్యామిలీ భావిస్తోందట.

సాహో కూడా ఇదే బాటలో.....

మరి ఇప్పటికే సాహో కి దుబాయ్ బడ్జెట్ 75 కోట్లనే టాక్ వుంది. దుబాయ్ లోని అబుదాబిలో సాహో యాక్షన్ సన్నివేశాలకు యువీ క్రియేషన్స్ వారు దాదాపుగా 75 కోట్ల ఖర్చు పెట్టినట్లుగా మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు రామ్ చరణ్ కూడా సై రా కోసం ఇలా కొన్ని యాక్షన్ సన్నివేశాలకు 50 కోట్లు పెట్టడం మాత్రం శుభపరిణామమే. ఎందులకంటే సై రా నరసింహారెడ్డి ఇండియా వైడ్ గా భారీగా విడుదల కాబోతుంది. మరి ఖర్చు విషయంలో వెనకడితే సినిమాలో క్వాలిటీ మిస్ అయి మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇప్పుడు దర్శక, నిర్మాతలు ఖర్చుకి వెనకాడకుండా స్టార్ హీరోల సినిమాలను మినిమమ్ వంద కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్నారు.

Similar News