జెస్సీ మూవీ రివ్యూ

జెస్సీ మూవీ రివ్యూ నటీనటులు: ఆషిమా, శ్రీత చందన, అతుల్‌ కులకర్ణి, కబీర్‌ సింగ్‌ తదితరులు సంగీతం: శ్రీచరణ్‌ పాకాల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినీ కుమార్‌ [more]

Update: 2019-03-15 09:25 GMT

జెస్సీ మూవీ రివ్యూ
నటీనటులు: ఆషిమా, శ్రీత చందన, అతుల్‌ కులకర్ణి, కబీర్‌ సింగ్‌ తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినీ కుమార్‌

టాలీవుడ్ లోనే కాదు.. అన్ని భాషల్లోనూ హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. హర్రర్ కథ కానీ కరెక్ట్ గా పండితే.. ఆ సినిమా హిట్ అవడం ఖాయమే. కాకపోతే ఆ హర్రర్ కథకు కామెడీ జోడిస్తే… ఆ సినిమా పక్కా హిట్ అనేది… ఓం కార్ రాజుగారి గది సీక్వెల్ తో నిరూపించాడు. ఇక టాలీవుడ్ లో అడపాదడపా ఈ హర్రర్ కథలతో సినిమాలు తెరకెక్కుతూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ లో కొత్త దర్శకుడు అశ్వినీ కుమార్ వి…. జెస్సీ అనే హర్రర్ మూవీని తెరకేక్కిన్చాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలేవీ లేక కళ తపింది. అందులోనూ విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో.. థియేటర్స్ అన్నీ బోసి పోతున్నాయి కూడా. మరి ఇలాంటి టైంలో ఈ హర్రర్ చిత్రం జెస్సీ ని ప్రేక్షకులు ఏ మేర ఆదరించారో.. ఫలితం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:
పావణి గంగిరెడ్డి, అభినవ్ గౌతమ్, అభిషేక్, పూర్ణిమలు ఘోస్ట్ హంటర్స్. దెయ్యాలు ఉన్నాయో లేదో ప్రాక్టికల్ ప్రూవ్ చేసే పనిలో ఊరు చివర్లో ఉన్న విక్టోరియా హౌస్‌కి వెళ్తారు. వీరికి మార్గమధ్యలో విక్టోరియా హౌస్ యజమాని సమీర(అర్చన) పరిచయం అవుతుంది. విక్టోరియా హౌస్‌లో ఉండే ఇద్దరు అక్కచెల్లెల్లు జెస్సీ(అషిమా), యమి(శ్రీత చందన) యాక్సిడెంట్‌లో చనిపోయి దెయ్యాలుగా మారారనే కారణంతో.. ఆ మహల్ ని ఎవరూ కొనరు. అయితే జెస్సీ, యమిలు నిజంగానే చనిపోయి ఆత్మలుగా అదే ఇంటిలో నివాసం ఉంటున్నారని తెలుసుకుంటారు. దెయ్యంగా మారిన జెస్సీనే ఘోస్ట్ హంటర్స్ కి తన కథను వివరించడం ఈ కథలోని ట్విస్ట్. జెస్సీ, యమి అక్కాచెల్లెళ్లు. యమి ఓ మాన‌సిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటుంది. త‌న వ‌య‌సు పెర‌గాల్సింది పోయి త‌గ్గుతూ ఉంటుంది. మ‌తిమ‌రుపు, కోపం ఆమె స‌హ‌జ ల‌క్ష‌ణాలు. అప్పుడ‌ప్పుడూ దెయ్యం ప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటుంది. యమి ప్ర‌వ‌ర్త‌న చూసి జెస్సీ భయపడుతుంది. మాన‌సిక వైద్యురాలి స‌హాయం తీసుకున్నా లాభం ఉండదు. దాంతో భూత‌వైద్యుడ్ని సంప్ర‌దిస్తుంది. జెస్సీలో ఓ అత్మ ఉంద‌న్న విష‌యం తెలుస్తుంది. ఇంతకీ జెస్సీని ఆవహించిన ఆ ఆత్మ ఎవరిది? యామి ఎందుకు దెయ్యం పట్టినట్టు ప్రవర్తించింది? అసలు ఈ అక్కచెల్లెల్లు ఎవరు? చివరికి వారంతా(ఘోస్ట్ హంటర్స్) నిజమైన దెయ్యాన్ని పట్టుకోగలిగారా? అనేది జెస్సి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పాత్ర:
క‌బీర్ సింగ్, అర్చ‌న, అతుల్ కుల‌క‌ర్ణి మిన‌హా అంతా కొత్త‌వాళ్లే. అర్చ‌న పాత్ర ప‌రిధి కూడా చాలా చిన్న‌దే. అందులో క‌బీర్ సింగ్ భూత వైద్యుడిగా క‌నిపిస్తాడు. కాకపొతే.. భూత‌వైద్యుడు అన‌గానే ఒళ్లంతా తాయత్తులు, రుద్రాక్ష‌లు, భయంకరంగా లేకుండా ఫార్మ‌ల్ దుస్తుల్లో చూపించ‌డం బాగుంది. అందుకే కబీర్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు అన్నది. హోస్ట్ హంటర్ టీం లీడర్‌గా పావని గంగిరెడ్డి ఆకట్టుకునే పెర్ఫామెన్స్ ఇచ్చింది. జెస్సీ, అమీల న‌ట‌న కూడా బాగుంది. ఇక పోలీస్ అధికారిగా అతుల్ నటనతో మెప్పించాడు.

విశ్లేషణ:
హర్రర్ సినిమాలు ఎలా ఉంటాయో.. అలానే ఈ జెస్సి సినిమా కథాను కూడా దర్శకుడు రాసుకున్నాడు. కథలో పెద్దగా కొత్తదనం అనిపించదు కానీ… కథనంలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు. దర్శకుడు ఇంట్రస్టింగ్ పాయింట్స్ జెస్సీ కథకు యాడ్ చేయడంతో ఆసక్తికరంగా సాగింది. అన్ని హర్రర్ మూవీస్ లోలానే… ఒక బూత్ బంగ్లా, ఆ బంగ్లాలో దెయ్యాలు, ఆ దెయ్యాలను వదిలించేందుకు నలుగురు ఘోస్ట్ హంటర్స్. ఇక ఆ ఇంట్లో వింత వింత అనుభవాలు.. దెయ్యం వీరిని ముప్పుతిప్పలు పెట్టడం.. హారర్ కథలు దాదాపు ఇదే నేపథ్యంలో వస్తుంటాయి. 18 ఏళ్లు దాటిన తరువాత వయసు తగ్గుతూ రావడం, ఇద్దరు అక్కాచెల్లల్ల మధ్య ఎమోషన్స్‌ ని క్యారీ చేస్తూనే.. ఆ కథకు హారర్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఎక్సయిట్‌ చేసే పాయింటే. అయితే ఆ పాయింట్‌కి సినిమాటిక్‌ స్క్రీన్‌ప్లే రాయడంలో కథను ఆసక్తికరంగా మలచడంలో గ్రిప్పింగ్ కోల్పోయాడు దర్శకుడు. ఫస్టాఫ్ మొత్తం సాఫీగా కథను నడిపిన దర్శకుడు సెకండాఫ్‌కి అసలు కథను దాచేశాడు. అయితే ఆ కథను రివీల్ చేయడంలో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. స్క్రీన్ ప్లే బేసెడ్‌గా నడిచిన ఈ చిత్రం ఏ సీన్ కి ఆ సీన్ భయపెట్టగలిగింది. అలాగే పోలీస్ ఆఫీస‌ర్ (అతుల్ కుల‌క‌ర్ణి) పాత్ర‌ని ప్ర‌వేశ పెట్టి, కొన్ని చిక్కుముడుల‌కు స‌మాధానాలు చెప్పిస్తారు. ఫ్లాష్ బ్యాక్ వ‌ర‌కూ.. ఈ క‌థ కొత్త‌గా అనిపిస్తుంది. కాకపోతే సంగీత ద‌ర్శ‌కుడు త‌న బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్స్‌ తో చాలా సన్నివేశాల్లో ప్రేక్షకుడిని భ‌య‌పెట్టాడు. అయితే దర్శకుడు కథను డీల్ చేసిన విధానం బాగుంది కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాడు. చివ‌ర్లో ఈ క‌థ‌ని ఎలా ముగించాలో ద‌ర్శ‌కుడికి అర్థం రాలేదు. అప్ప‌టి వ‌ర‌కూ కొత్త‌గా ఆలోచించి ప‌తాక స‌న్నివేశాల్ని మాత్రం ఓ మామూలు హార‌ర్ సినిమాలా మ‌లిచాడు. అసలు జెస్సీ ఎవరు అన్నది క్లైమాక్స్‌ కి ముందే తెలిసిపోవడంతో కథను అర్ధాంతరంగా ముగించి ఎండ్ కార్డ్ వేసేశాడు.

ప్లస్ పాయింట్స్: రన్ టైం, సినిమాటోగ్రఫీ, ట్విస్ట్స్, నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్: డైరెక్షన్, ఎమోషన్స్, ఎడిటింగ్, క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు

Tags:    

Similar News