ఓటిటి రివ్యూ: దిల్ బేచారా (4/5)

ఓటిటి రివ్యూ: దిల్ బేచారాబ్యానర్ : ఫాక్స్ స్టార్ స్టూడియోస్నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజన సంఘి, సైఫ్ అలీ ఖాన్, సాహిల్ వైడ్, స్వస్తిక [more]

Update: 2020-07-26 03:44 GMT

ఓటిటి రివ్యూ: దిల్ బేచారా
బ్యానర్ : ఫాక్స్ స్టార్ స్టూడియోస్
నటీనటులు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజన సంఘి, సైఫ్ అలీ ఖాన్, సాహిల్ వైడ్, స్వస్తిక ముఖేర్జీ, శాశ్వత ఛటర్జీ తదితరులు
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
నిర్మాతలు : ఫాక్స్ స్టార్ స్టూడియోస్
దర్శకుడు : ముఖేష్ ఛబ్రా

ఎన్నో కలలతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్న నటీనటులు.. కెరీర్ కిక్ ఇస్తే ఓకె.. లేదంటే అద్దంతరంగా తాను చాలిస్తున్నారు. అది ఈనాటి కథ కాదు. సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి కథే. ఒత్తిడి, కెరీర్ ఎత్తుపల్లాలు, సెలెబ్రిటీ హోదా నుండి బయటికి రాలేకపోవడం, హాయ్ లైఫ్ మాయింటినెన్స్, మానసిక సంఘర్షణ ఇలా ఎన్నో రకాల సమస్యలు నటులను ఆత్మహత్యకీ పురిగొలుపుతున్నాయి. కానీ కెరీర్ సాఫీగా సాగిపోతున్న కూడా ఆత్మహత్య చేసుకుంటే.. ఆది ఖచ్చితంగా మానసిక ఒత్తిడే. సాఫీగా అంటే.. మరీ దిగజారి లేకుండా.. చేతిలో సినిమాల్తో.. సొసైటీ లో ఓ హోదా, ఓ గర్ల్ ఫ్రెండ్ ఇలా దేనికదే.. ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే.. అంతకన్నా బాధ మరొకటి ఉండదు. ఎంతోమంది అభిమనులను సంపాదించుకున్నాక.. మానసిక ఒత్తిడితో తనువూ చాలించిన సుశాంత్ సింగ్ రాజపుట్ మరణించి నెలన్నర గడుస్తున్నా ఇంకా సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానుల గుండెల్లోనే కాదు.. సినిమా అంటే తెలిసినవాడి ప్రతి గుండెల్లో జీవించే ఉన్నాడు. భారీ బడ్జెట్ మూవీస్ లేకపోయినా.. చేతిలో సినిమాల్తో ఎప్పుడూ బిజీగా ఉండే సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆత్మహత్య ఇప్పటికి మిష్టరీని. ఇక సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులు ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారే థియేటర్స్ లో విడుదలైతే బావుండు అనుకునే లోపు.. దర్శకనిర్మాతలు సుశాంత్ సింగ్ రాజపుట్ నివాళిగా ఓటిటి ద్వారా ప్రపంచంలోని ప్రేక్షకులందరూ ఫ్రీ గా చూసేందుకు హాట్ స్టార్ వేదికగా దిల్ బేచారే ని విడుదల చేసారు. మరి అభిమానులే కాదు.. సాధార ప్రేక్షకుడు నుండి సినిమా, రాజకీయ సెలబ్రిటీస్ వరకు సుశాంత్ సింగ్ రాజపుట్ ఆఖరి చిత్రం చూడడానికి పోటీ పడ్డారు. మరి దిల్ బేచారే ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.

కథ:
ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్ అలియాస్ మ్యానీ (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) బోలు ఎముకల, కిజ్జి బసు (సంజన సంఘీ) థైరాయిడ్  క్యాన్సర్లతో బాధపడుతూ ఉంటారు. వీరిద్దరూ ఓ కాలేజ్ ఈవెంట్ లో కలుసుకుంటారు. మ్యాన్ని, కిజ్జి లు ఇద్దరూ ప్రేమలో పడతారు. అలాగే ఇద్దరు కావాల్సినట్టుగా టైం పాస్ చేస్తుంటారు. మ్యాన్ని రజనీకాంత్ కి వీరాభిమాని. కిజ్జి రచయిత మరియు స్వరకర్త అభిమన్యు వీర్ (సైఫ్ అలీ ఖాన్) అభిమాని. పారిస్ లో ఉన్న తన అభిమాన సింగర్ ని కలవాలని కిజ్జి, మన్నీతో చెబుతుంది. మరి కిజ్జి ని మ్యాన్ని పారిస్ తీసుకువెళ్లి ఫేవరేట్ సింగర్ ని కలిసేలా చేస్తాడా? క్యాన్సర్ పేషెంట్స్ గా ఉన్న వీరిద్దరి ప్రేమకథ పెళ్లి వరకు చేరిందా? అసలు చివరి దశలో ఉన్న ఈ ప్రేమ జంట కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అందమైన తన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలు కొల్లకొట్టాడు. తన నటనతో ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు పెట్టించడమే కాక… చివరి వరకు మిమ్మల్ని కట్టిపడేసాడు. క్యాన్సర్ రోగి అయినప్పటికీ జీవితాన్ని ఎల్లప్పుడూ ఎంజాయ్ చేసే యువకుడిగా సుశాంత్ సింగ్ నటన చాలా నేచురల్ గా అనిపిస్తుంది. కామెడీ సన్నివేశాలలో పాటు, క్లైమాక్స్ లోని ఎమోషనల్ సన్నివేశాలలో సుశాంత్ నటన అధ్బుతం అని చెప్పాలి. ఇక డెబ్యూ హీరోయిన్ సంజన సంఘీ పాత్ర ఈ సినిమాకే హైలెట్ అనేలా ఉంది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన ఎవరైనా డెబ్యూ హీరోయిన్ అనుకోవడం కష్టం.. అంత అద్భుతంగా నటించింది. అనుభవం లేకపోయినప్పటికీ, ఆమె తన అద్భుతమైన నటనతో కిజ్జీ పాత్రకి వన్నె తెచ్చింది. సున్నితమైన ప్రేమ కథలో క్యాన్సర్ రోగిగా ఆమె నటన సూపర్ అనే చెప్పాలి. ఇక మిగతా నటీనటులు పరిధిమేర మెప్పించారు.

విశ్లేషణ:
దర్శకుడు ముఖేష్ ఛబ్రా ఈ సినిమాని తెలుగులో అప్పుడెప్పుడో వచ్చిన నాగార్జున గీతాంజలిని చూసి ఇన్స్పైర్ అయ్యి దిల్ బేచారా సినిమా తీసాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే గీతాంజలి సినిమాలో నాగార్జునకి హీరోయిన్ కి క్యాన్సర్ ఉంటుంది. ఇక ఈ దిల్ బేచారే లో కూడా సుశాంత్ సింగ్ రాజపుట్ కి, హీరోయిన్ సంజన సంఘి కి క్యాన్సర్ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం గురించి తెలిసినట్టుగానే ఈ సినిమా స్క్రిప్ట్ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజపుట్ నటన, అందమైన నవ్వు చూస్తుంటే అతను మరణించాడనిపించదు. అలాంటి నటనతో దిల్ బేచారే లో సుశాంత్ సింగ్ అదరగోటేట్సాడు. అందమైన ప్రేమకావ్యాన్ని ప్రేక్షకులముందుకు తేగలిగాడు కానీ. మానసిక ఒత్తిడిని దిగమించాలకేపోయెదనేది యెప్పటికీ గ్రహించలేని సత్యమే. ఇక సినిమాలో సుశాంత్ సింగ్ క్యాన్సర్ తో నేను చనిపోయాక నా చివరి అంతిమ యాత్ర ఎలా ఉంటుంది, అలాగే చనిపోయిన నా గురించి స్నేహితులుగా మీరేం మాట్లాడతారో మాట్లాడండి అని చెప్పడం చుస్తే సుశాంత్ అప్పటికే ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడా అనిపించకమానదు. చాలా సన్నివేశాలు గుండెల్ని పిండేసే విధంగా ఉండడం, బహుశా సుశాంత్ సింగ్ రాజపుట్ మరణాన్ని చూసి అనిపించిందేమో. క్యాన్సర్ రోగులుగా చివరి దశలో ఉన్న వారితో కావాల్సిన రొమాంటిక్ కామెడీ, ఎమోషన్ ని దర్శకుడు బాగానే పండించాడు. కాకపోతే ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు త్వరగా ముగించిన భావన కలుగుతుంది. అలాగే సుశాంత్ సింగ్ రాజపుట్ జ్ఞాపకాలతో సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి హీరో హీరోయిన్ మధ్య మరి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉంటే బాగుండు అన్న భావన కలుగుతుంది.

సాంకేతికంగా..
ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్.. సినిమాకి మెయిన్ ఎస్సెట్. రెహ్మాన్ అందించిన పాటలే కాదు..  నేపథ్య సంగీతం సినిమాకి మరింత ఆకర్షణ చేకూర్చాయి. సినిమాటోగ్రఫీ బావుంది. స్క్రీన్ ప్లేలో ఎటువంటి లాగ్స్ లేకుండా… ఎడిటింగ్ చాలా క్లారిటీగా స్పష్టంగా ఉందనిపిస్తుంది నిర్మాణ కథానుసారం ఉన్నాయి.

Tags:    

Similar News