సూర్య మొదటి రోజు ఎంత లాగాడంటే...!!

Update: 2018-05-05 08:42 GMT

అల్లు అర్జున్ - వక్కంతం వంశి కలయికలో నా పేరు సూర్య నిన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలంత హిట్ టాక్ తెచ్చుకోకపోయినా... మంచి టాక్ అయితే నా పేరు సూర్యకి వచ్చింది. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అల్లు అర్జున్ ఎప్పటిలాగే ఈ సినిమాలో అదరగొట్టేసాడు. వక్కంతం వంశి దర్శకత్వానికి కొత్త. అయినా సినిమాని ఒక రేంజ్ లో నిలపడానికి అతను పడిన కష్టం తెరమీద ప్రతి సీన్ లో కనబడుతుంది.అక్కడక్కడా డ్రా బాక్స్ తప్ప సినిమా ప్రేక్షకులను బాగానే కట్టిపడేసింది. ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదలయిన అల్లు అర్జున్ నా పేరు సూర్య మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగానే లాగేసింది. అల్లు అర్జున్ నా పేరు సూర్యకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయనడానికి ఈ ఫిగర్స్ సాక్ష్యం.

ఏరియా షేర్స్ కోట్లలో

నైజాం 4.05

సీడెడ్ 2.35

నెల్లూరు 0.65

కృష్ణ 1.05

గుంటూరు 2.47

వైజాగ్ 2.02

ఈస్ట్ గోదావరి 2.07

వెస్ట్ గోదావరి 1.54

ఏపీ మరియు టీఎస్ మొదటి రోజు లెక్కలు: 16.20

Similar News