నదిని దాటాలనుకుని.. కొట్టుకుపోయిన రష్యా బెటాలియన్

రెండు లేదా అంతకంటే ఎక్కువ రష్యన్ ఆర్మీ బెటాలియన్‌లతో కూడిన సైన్యం నదిని దాటుతూ ఉండగా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2022-05-14 06:36 GMT

రష్యా.. ఉక్రెయిన్ మీద పట్టు సాధించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే..! రష్యాను ఉక్రెయిన్ ఎంతో ధీటుగా ఎదుర్కొంటూ ఉండగా.. రష్యా వీలైనంత త్వరగా సంపూర్ణ విజయాన్ని అందుకోవాలని భావిస్తూ ఉంది. రష్యా పెద్ద ఎత్తున సైన్యాన్ని కోల్పోతూనే ఉంది. తాజాగా నదిని దాటాలని అనుకున్న రష్యా సైన్యం ఏకంగా ఓ బెటాలియన్ ను కోల్పోయే ప్రమాదంలో చిక్కుకుంది.

రెండు లేదా అంతకంటే ఎక్కువ రష్యన్ ఆర్మీ బెటాలియన్‌లతో కూడిన సైన్యం నదిని దాటుతూ ఉండగా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. 100 వాహనాలు, వెయ్యి కంటే ఎక్కువ మంది సైనికులు సివర్‌స్కీ డోనెట్స్ నదిపై ఉన్న పాంటూన్ వంతెనను దాటడానికి ప్రయత్నించారు. ఇది ఉక్రెయిన్ తూర్పున ఉన్న వేర్పాటువాద ప్రావిన్సులైన డోనెట్స్క్, లుహాన్స్క్ మధ్య ఉంటుంది. బెటాలియన్ ఆ బ్రిడ్జిని దాటుతూ ఉండగా ఉక్రేనియన్ సైన్యం దాడులు చేయడంతో బ్రిడ్జి దెబ్బతింది. దీంతో దాదాపు ఆరు డజన్ల ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలు నాశనం అయ్యాయి. అంతేకాకుండా బెటాలియన్ మొత్తం నదిలో పడిపోవడంతో రష్యాకు తీరని నష్టం చోటు చేసుకుందని ప్రపంచ మీడియా చెబుతోంది. డాన్‌బాస్‌లో రష్యా గ్రౌండ్ ఫోర్స్ నిదానంగా ముందుకు వెళుతోందని U.S. రక్షణ శాఖ అధికారి అన్నారు. నదులను దాటడానికి రష్యన్లు అత్యంత ప్రమాదకరంగా భావిస్తూ ఉన్నారని.. ఎంతగానో భయపడుతూ ఉన్నారని.. U.K. రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రేనియన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రకారం, పాంటూన్ వంతెన వద్ద చిక్కుకున్న బెటాలియన్, డూమ్డ్ క్రాసింగ్‌కు పశ్చిమాన 17 మైళ్ల దూరంలో ఉన్న 20,000 మంది జనాభా కలిగిన లైమాన్ వద్ద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
డ్రోన్స్ సాయంతో ఉక్రేనియన్ సైన్యంకు చెందిన 17వ ట్యాంక్ బ్రిగేడ్ వంతెనను గుర్తించింది. చిన్న డ్రోన్‌ల సహాయంతో ఉక్రేనియన్ సైన్యం రష్యా బెటాలియన్ నదిని దాటుతూ ఉండడాన్ని గుర్తించారు. అదను చూసి దాడి చేయడంతో రష్యా ఒక బెటాలియన్ మొత్తాన్ని కోల్పోవలసి వచ్చింది. ఎంత మంది రష్యన్లు మరణించారు లేదా గాయపడ్డారనేది అస్పష్టంగా ఉంది. ఈ ఘటన తర్వాత స్థానిక రష్యన్ దళాలు ఎక్కువగా నదికి అవతలి వైపు ఉండిపోయాయి.


Tags:    

Similar News