Gold Prices Budget : బడ్జెట్ లో ఆ నిర్ణయం.. బంగారం ధర మరింత ప్రియమవుతుందా?

బడ్జెట్ లో దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించితే ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు

Update: 2024-01-24 04:07 GMT

బంగారం ధరలు పెరగలేదు. సంతోషం. కానీ పెరగలేదని ఆనందపడితే లాభం లేదు. అలాగని తగ్గలేదు కూడా. బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో పసిడి ధరలు పెరుగుతుంటాయి. కొన్ని సార్లు తగ్గుతుంటాయి. మరికొన్ని సార్లు నిలకడగా కొనసాగుతుంటాయి. అయితే బడ్జెట్ దగ్గర పడుతుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

కస్టమ్స్ డ్యూటీ...
బడ్జెట్ లో దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించితే ధరలు మరింత పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటోతేదీన లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో పసిడిపై తీసుకునే నిర్ణయంపైనే ధరల పెరుగుదలా? తగ్గుదలా? అన్నది ఆధారపడుతుందటుంది. దిగుమతులను తగ్గించడం, కస్టమ్స్ డ్యూటీ కూడా పెంచితే పసిడి ధరలు మరల పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. అలా కాకుండా కొంత తగ్గించగలిగితే పసిడి ధరలు దిగిరావచ్చంటున్నారు.
ఈరోజు ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరల 57,800 రూపాయలుగా కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,050 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర మాత్రం ఈరోజు మార్కెట్ లో 76,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News