అరుదైన వండ్రంగి తేనెటీగ కనిపించిందిగా!!

ఈ సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.

Update: 2025-06-23 08:30 GMT

ఈ సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అయితే అవి అత్యంత అరుదుగా మాత్రమే తారసపడుతూ ఉంటాయి. శేషాచలం అడవీ ప్రాంతంలో అరుదైన తేనెటీగ కనిపించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ తేనెటీగ పేరు 'వ్యాలీ కార్పెంటర్ బీ'. దీనిని స్థానికులు 'వడ్రంగి తేనెటీగ' అని కూడా అంటారు . ఎస్వీయూకు చెందిన డా. హరికృష్ణ ఓ మంచినీళ్ల గుంత సమీపంలో దీన్ని గుర్తించారు. ఇవి ఉత్తర అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని జాతులు భారతదేశంలోని మధ్య, పశ్చిమ కనుమల్లో ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఈ తేనెటీగలు ఆపిల్, పుచ్చకాయలు సహా అనేక పంటలకు ముఖ్యమైన పరాగ సంపర్కాలు. అవి ఈ మొక్కల నుండి వచ్చే తేనె, పుప్పొడిని తింటాయి. గొంగళి పురుగులు, అఫిడ్స్ వంటి ఇతర కీటకాలను తింటాయి

Tags:    

Similar News