70కోట్లకు హ్యాండ్ బ్యాగ్ కొన్న అజ్ఞాత వ్యక్తి
అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ భారీ ధర పలికింది.
అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ భారీ ధర పలికింది. చిరిగిపోయి, బాగా వాడేసిన నల్లని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఏకంగా 82 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. భారత కరెన్సీ లో దాదాపు 70 కోట్ల రూపాయలు. ఒక హ్యాండ్ బ్యాగ్‌కు ఇంతటి ధర పలకడం వేలంపాటల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రఖ్యాత సోత్‌బీ వేలం సంస్థ దీనిని ఆన్‌లైన్‌లో విక్రయించింది. 10 లక్షల డాలర్ల బిడ్డింగ్‌తో మొదలైన వేలం పాట 82 లక్షల డాలర్లకు చేరింది. జపాన్‌కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగును సొంతం చేసుకున్నారు. నటి జేన్ బిర్కిన్ నేపథ్య గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, సామాజిక కార్యకర్తగా అప్పట్లో పేరు సంపాదించారు. ఫ్యాషన్ ప్రపంచ ఐకాన్‌గా వెలిగారు. హెర్మ్స్ లగ్జరీ వస్తువుల సంస్థ ప్రత్యేకంగా బిర్కిన్ కోసమే 1984లో ఈ బ్యాగును తయారుచేసింది.