గాంధీజీ ఆయిల్ పెయింటింగ్ 1.75 కోట్లు
మహాత్మాగాంధీకి చెందిన అరుదైన ఆయిల్ పెయింటింగ్ ఏకంగా కోటి 75 లక్షల రూపాయలు పలికింది.
మహాత్మాగాంధీకి చెందిన అరుదైన ఆయిల్ పెయింటింగ్ ఏకంగా కోటి 75 లక్షల రూపాయలు పలికింది. తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువ మొత్తానికి ఈ చిత్రం అమ్ముడుపోయిందని లండన్ కు చెందిన వేలం సంస్థ బోన్హామ్స్ చెప్పడం విశేషం. భారత రాజ్యాంగ సంస్కరణలను చర్చించడానికి, స్వపరిపాలన డిమాండ్లను పరిష్కరించడానికి జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి 1931లో గాంధీ లండన్ వెళ్లారు. ఆ సమయం లో బ్రిటిష్ కళాకారిణి క్లేర్ లైటన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గాంధీజీ కూర్చుని ఉన్న ఏకైక ఆయిల్ పెయింటింగ్ ఇదేనని బోన్హామ్స్ సంస్థ తెలిపింది. ఆ సమయంలో గాంధీజీ కార్యాలయంలోకి ప్రవేశించిన అతికొద్ది మంది కళాకారుల్లో క్లేర్ లైటన్ కూడా ఒకరు.