నాగోలు మహదేవ్ జ్యుయలర్స్ దోపిడీ: కీలక సూత్రధారి అతనే

నాగోలు మహేంద్ర జ్యుయలర్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి బంగారాన్ని దోచుకున్న వారిని కనిపెట్టారు.

Update: 2022-12-07 05:08 GMT

నాగోలు మహదేవ్ జ్యుయలర్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన వారు ఎవరనేది కనిపెట్టారు. ఈ దోపిడీకి కీలక సూత్రధారిగా గజ్వేల్ కు చెందిన మహేంద్రగా గుర్తించారు. నాగోలు మహదేవ్ జ్యుయలర్స్ లో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఆభరణాలను దోచుకోవడమే కాకుండా నాటు తుపాకీతో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు మహేంద్ర జ్యుయలర్స్ లోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

నెల క్రితమే రెక్కీ...
నెల క్రితమే నగల దుకాణంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసు విచారణలో వెల్లడయింది. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి ఈ దోపిడీకి పాల్పడ్డారంటున్నారు.దోచుకున్న బంగారంలో కొంత మొత్తాన్ని గజ్వేల్ లోని మహేంద్ర ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కిలోన్నర బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడిన బైక్ చోరీకి గురయినట్లు పోలీసులు కనుగొన్నారు. అంతరాష్ట్ర దోపిడీగా గుర్తించిన పోలీసులు 15 బృందాలుగా విడిపోయి ఈ దోపిడీ కేసును ఛేదించారు. మహేంద్రతో పాటు ఆరుగురు అంతరాష్ట్ర దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News