తండ్రినే డ్రగ్స్ కొనడానికి డబ్బులు అడిగాడు.. అందుకు నిరాకరించడంతో..!

ఈ ఘటనపై కామత్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు రంజన్ తన

Update: 2022-08-06 06:13 GMT

బీహార్‌లోని పూర్నియాలో డ్రగ్స్ కొనడానికి డబ్బు ఇవ్వడానికి తండ్రి నిరాకరించాడు. దీంతో ఆ వ్యక్తి తన తండ్రిని కూడా చంపేందుకు వెనుకాడలేదు. ఏకంగా కాల్పులు జరిపాడు. డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు తన ఇంటి బయట ఉన్న బైక్‌కు కూడా నిప్పుపెట్టాడు. తండ్రి హీరాలాల్ సా తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. ఇంటి నుండి తప్పించుకుని.. ఆ తరువాత అతను పూర్నియాలోని రూపాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. తన కొడుకు గురించి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసు ఇన్స్పెక్టర్ మహదేవ్ కామత్ తన బృందంతో కలిసి ఇంటికి చేరుకుని నిందితుడు రంజన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కామత్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు బానిసైన నిందితుడు రంజన్ తన తండ్రిని డ్రగ్స్ కొనేందుకు డబ్బులు అడిగాడని.. అందుకు అతడు నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన రంజన్ తన ఇంటి బయట బైక్‌ ను తగులబెట్టాడు. ఇంట్లో సోదాలు చేయగా, ఒక పిస్టల్, పది మందుగుండు సామాగ్రి, ఒక బాకు, కాలిపోయిన మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు కామత్ తెలిపారు. నిందితుడిపై ఆయుధ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు పంపినట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News