2021లో భర్త మరణం.. ఇప్పుడు ఆ భార్య, ఇద్దరు పిల్లలు ఏ నిర్ణయం తీసుకున్నారంటే

పోలీసులు తలుపు తెరవగలిగారు.. గ్యాస్ సిలిండర్ పాక్షికంగా తెరిచి ఉందని

Update: 2022-05-22 08:40 GMT

ఢిల్లీలోని వసంత విహార్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వారు నివసిస్తూ ఉండే ప్లాట్ లో శవమై కనిపించారు. నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8.55 గంటలకు, వసంత్ విహార్ ప్రాంతంలోని వసంత్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నంబర్ 207 లోపలి నుండి తాళం వేసి ఉందని.. ఆ ఇంట్లో నుండి ఎలాంటి శబ్దాలు, సంచారం కనిపించడం లేదని ఫిర్యాదు అందింది. పోలీసులు ఆ ప్లాట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. తలుపులు తెరిచి లోప‌లికి ప్ర‌వేశించారు. ఆ ప‌రిస‌రాల‌ను గ‌మ‌నించగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పాక్షికంగా తెరిచి ఉండ‌టంతో పాటు సూసైడ్ నోట్ కూడా ల‌భించింది. లోపలి గదిలో వెతకగా మూడు మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. ఆ గ‌దిలోనే మూడు చిన్న బొగ్గుల కుంపటి లాంటి పరికరాలను ఉంచారు. అందులో నిప్పు పెట్టి పొగ వచ్చేలా చేశారు. ఆ పొగ బయటకు వెళ్లకుండా కిటికీలు, డోర్లు మూసివేశారు.

మృతులను మంజు, ఆమె కుమార్తెలు అన్షిక, అంకుగా గుర్తించారు. అయితే మంజు భర్త గత ఏడాది ఏప్రిల్‌లో కరోనా వైరస్ బారిన ప‌డి మరణించాడు, అప్ప‌టి నుంచి ఈ కుటుంబం డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది. మంజు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఘోరం జరిగిన ఇంట్లో అన్ని వైపులా తలుపులు, కిటికీలు మూసివేయబడి, ఫ్లాట్ లోపలి నుండి తాళం వేసి ఉండటాన్ని కనుగొన్నారు. "పోలీసులు తలుపు తెరవగలిగారు.. గ్యాస్ సిలిండర్ పాక్షికంగా తెరిచి ఉందని, సూసైడ్ నోట్ కూడా ఉందని కనుగొన్నారు" అని డిసిపి చెప్పారు. ఇంటి యజమాని, ఇద్దరు కుమార్తెల తండ్రి, కోవిడ్ -19 కారణంగా ఏప్రిల్ 2021 లో మరణించారు. అప్పటి నుండి, మంజు కూడా అనారోగ్యంతో మంచం పట్టడంతో కుటుంబం తీవ్ర నిరాశలో ఉంది. చివరికి అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.


Similar News