Ayodhya trains : అయోధ్యకు వెళ్లాలరనుకుంటున్నారా? అయితే సులువుగా.. తక్కువ ధరలో ఇలా వెళ్లండి

అయోధ్యలో శ్రీరాముడిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు బయలుదేరుతున్నారు

Update: 2024-01-19 11:58 GMT

అయోధ్యలో శ్రీరాముడిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు బయలుదేరుతున్నారు. వీరు అయోధ్యకు సురక్షితంగా చేరుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయోధ్యకు ప్రతి సోమవారం వరంగల్ నుంచి ఈ రైలు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

స్పెషల్ ట్రైన్ లు...
శ్రద్ధా సేత్ రైలుగా దీనికి నామకరణం చేశారు. వరంగల్ నుంచి సోమవారం, కాజీపేట నుంచి ప్రతి శుక్రవారం బయలుదేరే ఈ ప్రత్యేక రైలులో ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుందని పేర్కొంది. కాజీపేట నుంచి యశ్వంత్ పూర్ - గొరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా అయోధ్యకు వెళుతుందని తెలిపారు. ఈ రైళ్లలో జనరల్ టిక్కెట్ ధర నాలుగు వందల రూపాయలు కాగా, స్లీపర్ కోచ్ లో ప్రయాణ ధర 658 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.


Tags:    

Similar News