Ayodhya : నేటి నుంచి దర్శనాల నిలిపివేత

అయోధ్యలో ఈనెల 22వ తేదీన రామ విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

Update: 2024-01-20 03:48 GMT

అయోధ్యలో ఈనెల 22వ తేదీన రామ విగ్రహ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నేటి నుంచి బాలాయంలో దర్శనాలను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మాత్రమే ప్రధాన ఆలయంలోకి దర్శానికి అనుమతిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి అయోధ్యలో బాలరాముడి దర్శనానికి సందర్శకులకు అనుమతి ఉంటుందని ట్రస్ట్ పేర్కొంది.

కిటకిటలాడుతున్న అయోధ్య...
అయితే అయోధ్యలో విగ్రహప్రతిష్టకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పెద్దయెత్తున భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పటికే అయోధ్యలోని వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని లాడ్జిలు భక్తులతో నిండిపోయాయి. ప్రాణప్రతిష్టను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశముందని భావించిన పోలీసులు నిరంతరం నిఘా పెంచారు. ప్రతి వ్యక్తినీ పరిశీలించిన అనంతరమే పంపిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News