అమరరాజా అందుకు వెళ్లలేదు

అమరరాజా కంపెనీ వెళ్లిపోవడానికి ప్రభుత్వ వేధింపులు కారణం కాదని మంత్రి గుడివాడ అమరనాధ్ అన్నారు

Update: 2022-12-03 12:29 GMT

అమరరాజా కంపెనీ వెళ్లిపోవడానికి ప్రభుత్వ వేధింపులు కారణం కాదని మంత్రి గుడివాడ అమరనాధ్ అన్నారు. ఒక కంపెనీ ఇతర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదా? అని ఆయన ప్రశ్నించారు. అమరరాజా కంపెనీకి చట్ట ప్రకారమే నోటీసులు గతంలో ఇచ్చామని తెలిపారు. పర్యావరణం, కార్మికుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. 2010 లో అమరరాజా కంపెనీకి 483 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే 252 ఎకరాల్లో ఎలాంటి కార్యక్రమాలు ఆ సంస్థ చేపట్టలేదన్నారు.

నిబంధనలు పాటించకుండా....
పొల్యూషన్ నిబంధనలు సయితం ఆ కంపెనీ పాటించకపోవడంతో అమరరాజా కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల రక్తనమూనాల్లో లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటించాలని మాత్రమే తాము చెప్పామని అమరనాధ్ అన్నారు. అయినా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 3,4 తేదీల్లో ఇన్విస్వ్‌‌మెంట్ సమ్మిట్ ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అమరనాధ్ తెలిపారు.


Tags:    

Similar News