Fri Dec 05 2025 20:22:56 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మేకపాటి మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మరికాసేపట్లో హైదరాబాద్ కు..
గౌతమ్ రెడ్డి మొదటి నుంచి తనకు చాలా సుపరిచితుడేనని.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డిని కోల్పోవడం

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మంత్రి మేకపాటి గౌతమ్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
Also Read : మంత్రి మేకపాటి చివరి క్షణాలు..
గౌతమ్ రెడ్డి మొదటి నుంచి తనకు చాలా సుపరిచితుడేనని.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డిని కోల్పోవడం తమ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. తన యువ మంత్రివర్గంలో సహచరుడిని కోల్పోవడం తీవ్రంగా కలచి వేసిందన్నారు సీఎం జగన్. భారమైన హృదయంతో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు మరికొద్దిసేపటిలో సీఎం జగన్ హైదరాబాద్ కు బయల్దేరనున్నారు.
Next Story

