Thu Mar 19 2026 04:12:26 GMT+0530 (India Standard Time)
మంత్రి మేకపాటి చివరి క్షణాలు..
మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతిపై అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి. మంత్రి మేకపాటి చివరి క్షణాలు ఎలా

ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి. మంత్రి మేకపాటి చివరి క్షణాలు ఎలా గడిచాయో వివరించారు ఆస్పత్రి వైద్యులు. సోమవారం ఉదయం సుమారు 7.45 గంటల సమయంలో జూబ్లిహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి మంత్రిని తీసుకువచ్చారు.
ఆస్పత్రికి వచ్చే సరికే ఆయన తీవ్ర గుండెపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. అప్పటికే ఆయన నాడీ అందకపోవడం, శ్వాస కూడా తీసుకోకపోవడంతో అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఎమర్జెన్సీ మెడిసిన్ టీమ్, కార్డియాలజిస్ట్ లు, క్రిటికల్ కేర్ డాక్టర్లు సహా ఆస్పత్రిలో ఉన్న స్పెషలిస్టులంతా ఆయనను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 90 నిమిషాల పాటు వైద్యులంతా తమ సాయశక్తులా ప్రయత్నించినా మేకపాటి గౌతమ్ ను బ్రతికించలేకపోయారు. ఉదయం 9.16 గంటలకు ఆయన మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
Next Story

